లావాసెగపై ‘పకాయా పిజ్జా’
దిశ, ఫీచర్స్ : ఐస్‌లాండ్ రాజధాని రెక్‌జావిక్‌కు సమీపంలో ఉన్న ‘ఫగ్రడాల్ ఫై జాల్’ అనే అగ్నిపర్వతం మార్చి నెలలో బద్దలైన విషయం తెలిసిందే. 800 ఏళ్ల తర్వాత తొలిసారిగా విస్ఫోటనం చెందిన ఆ ఆగ్నిపర్వతంపై పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలు లావాపై ఆమ్లెట్, సాసేజ్, శాండ్‌విచ్‌లను తయారు చేసుకుని హ్యాపీగా తినేశారు. వాటికి సంబంధించిన వీడియో నెట్టింట్లో అప్పట్లో వైరల్ అయింది. కాగా ఆ వీడియో చూసి స్ఫూర్తి పొందాడో ఏమో తెలియదు గానీ, గ్వాటెమాలాకు చెందిన […]
దిశ, ఫీచర్స్ : ఐస్‌లాండ్ రాజధాని రెక్‌జావిక్‌కు సమీపంలో ఉన్న ‘ఫగ్రడాల్ ఫై జాల్’ అనే అగ్నిపర్వతం మార్చి నెలలో బద్దలైన విషయం తెలిసిందే. 800 ఏళ్ల తర్వాత తొలిసారిగా విస్ఫోటనం చెందిన ఆ ఆగ్నిపర్వతంపై పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలు లావాపై ఆమ్లెట్, సాసేజ్, శాండ్‌విచ్‌లను తయారు చేసుకుని హ్యాపీగా తినేశారు. వాటికి సంబంధించిన వీడియో నెట్టింట్లో అప్పట్లో వైరల్ అయింది. కాగా ఆ వీడియో చూసి స్ఫూర్తి పొందాడో ఏమో తెలియదు గానీ, గ్వాటెమాలాకు చెందిన డేవిడ్ గార్సియా అనే కుర్రాడు లావాపై పిజ్జాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
https://twitter.com/AFP/status/1392464577221197832
సెంట్రల్ అమెరికా దేశమైన ‘గ్వాటెమాల’ అగ్నిపర్వతాలు, వర్షారణ్యాలు ప్రాంతాలు, పురాతన మయన్ ప్రదేశాలకు నిలయం. గ్వాటెమాలా నగరానికి దక్షిణాన 25 కిలోమీటర్ల దూరంలో ‘పకాయ’ అనే అగ్నిపర్వతముంది. ఫిబ్రవరిలో బద్ధలైన ఈ అగ్నిపర్వతం నుంచి లావా ఇప్పటికీ వెదజల్లుతూనే ఉంది. ఈ అగ్నిపర్వతాన్ని చూసేందుకు ఎంతోమంది సందర్శకులు అక్కడికి వస్తున్నారు. గ్వాటెమాలకు చెందిన డేవిడ్ గార్సియా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పర్వతం నుంచి ఎగజిమ్ముతున్న లావాపై పిజ్జా తయారు చేస్తూ సందర్శకులకు యూనిక్ టేస్ట్ అందిస్తున్నాడు. అంతేకాదు ‘పకాయ’ అగ్నిపర్వతం మీద పిజ్జాలు చేస్తుండటంతో వాటికి ‘పకాయ పిజ్జా’గా నామకరణం చేయడం విశేషం. గార్సియా పిజ్జా తయారీ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. లావా వేడి నుంచి రక్షణ పొందేందుకు, స్పెషల్ డ్రెస్, పిజ్జా తయారీ కోసం ఆ ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రత్యేక పాత్రలను వాడుతున్నాడు. దాదాపు 800 ఫారన్హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న లావాపై పిజ్జా కేవలం 14 నిమిషాల్లో తయారవుతుంది.