కరోనా అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య

దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాంపేట్ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని అంతమ్మగూడెం గ్రామానికి చెందిన రావుల సాయి(29) శనివారం ఉదయం ఇంటి నుంచి కారులో బయలుదేరి.. తూప్రాన్ పేట్ నుండి దండుమైలారం వెళ్లేదారిలో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని చౌటుప్పల్ సీఐ వెంకన్న తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు […]

Update: 2020-08-08 01:41 GMT

దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాంపేట్ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని అంతమ్మగూడెం గ్రామానికి చెందిన రావుల సాయి(29) శనివారం ఉదయం ఇంటి నుంచి కారులో బయలుదేరి.. తూప్రాన్ పేట్ నుండి దండుమైలారం వెళ్లేదారిలో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని చౌటుప్పల్ సీఐ వెంకన్న తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News