దొంగను పట్టించిన రోల్డ్‌గోల్డ్‌ చైన్ !

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఓ మహిళ ధరించిన రోల్డ్‌గోల్డ్‌తో చోరీకి గురైన నగలు మొత్తం దొరికాయి. మల్కాజిగిరి‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సాయిపురి‌కాలనీ రామాదేవి నిలయం మొదటి అంతస్తులో ప్రైవేటు ఉద్యోగి రవికిరణ్ నివాసం ఉంటున్నాడు. 2019 జూలై 12న తొలిఏకాదశి సందర్భంగా దంపతులు ఇంటికి తాళం వేసి సాయిబాబా ఆలయానికి వెళ్లి, మధ్యాహ్నం 2.30గంటలకు వచ్చేసరికి బీరువాలో ఉన్న బంగారపు కడియం, చైన్, 2జతల చెవి దుద్దులు, రెండు రింగులతో […]

Update: 2020-10-31 09:02 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఓ మహిళ ధరించిన రోల్డ్‌గోల్డ్‌తో చోరీకి గురైన నగలు మొత్తం దొరికాయి. మల్కాజిగిరి‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సాయిపురి‌కాలనీ రామాదేవి నిలయం మొదటి అంతస్తులో ప్రైవేటు ఉద్యోగి రవికిరణ్ నివాసం ఉంటున్నాడు. 2019 జూలై 12న తొలిఏకాదశి సందర్భంగా దంపతులు ఇంటికి తాళం వేసి సాయిబాబా ఆలయానికి వెళ్లి, మధ్యాహ్నం 2.30గంటలకు వచ్చేసరికి బీరువాలో ఉన్న బంగారపు కడియం, చైన్, 2జతల చెవి దుద్దులు, రెండు రింగులతో పాటు ఫ్యాన్సీ ఫింగర్ రింగ్ అపహరణకు గురయ్యాయి. దీంతో స్టేషన్‌లో రవికిరణ్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసును ఛేదించలేక పోయారు.

అయితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన జితేందర్ అదే అపార్ట్మెంట్‌లో వాచ్‌మెన్‌గా ఉంటున్నాడు. ఓరోజు జితేందర్ తల్లి రోల్డ్‌గోల్డ్ చైన్ తన మెడలో వేసుకోగా రవికిరణ్‌కు అనుమానం రావడంతో ఫోటో తీశాడు. అనంతరం అదే చైన్‌తో గతంలో తన భార్య దిగిన పాత ఫోటోను పోల్చి చూడగా చోరీకి గురైన నగల్లో ఇది కూడా ఒకటని నిర్ధారించుకొని.. వాచ్‌మెన్ కుటుంబంపై అనుమానం ఉన్నట్టు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఇదేక్రమంలో పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు జితేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News