క్షుద్ర పూజల కలకలం.. పిడిగుద్దులు గుద్దుతూ.. గబ్బిలంతో అలా చేస్తూ..
దిశ, ఫరూక్ నగర్ : ఓవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న తరుణంలో మరోవైపు క్షుద్ర పూజలపేరుతో మంత్రాలు మారుమోగుతున్నాయి. క్షుద్ర పూజల నెపంతో ఎంతో మంది అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మాత్రికుని దగ్గరకు వెళ్లేవారికి కళ్ళలో నిమ్మకాయల రసం పిండి వెంట్రుకలు పట్టి పిడిగుద్దులు, గుద్దేవాడని అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టీ వశీకరణ మంత్రం రాగి పుతలతో కూడుకున్న […]
దిశ, ఫరూక్ నగర్ : ఓవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న తరుణంలో మరోవైపు క్షుద్ర పూజలపేరుతో మంత్రాలు మారుమోగుతున్నాయి. క్షుద్ర పూజల నెపంతో ఎంతో మంది అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మాత్రికుని దగ్గరకు వెళ్లేవారికి కళ్ళలో నిమ్మకాయల రసం పిండి వెంట్రుకలు పట్టి పిడిగుద్దులు, గుద్దేవాడని అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టీ వశీకరణ మంత్రం రాగి పుతలతో కూడుకున్న పేర్లు రాసి పెడతాడాని బాధితులు ఆరోపిస్తున్నారు. అతని బాధితులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని షాద్ నగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కమ్మదనం గ్రామ శివారులో అనంతపురం ప్రాంతానికి చెందిన శివస్వామి అనే ఓ వ్యక్తి ఇక్కడ గత కొంత కాలంగా ఓ ప్రైవేటు వెంచర్‌లో ఇల్లు నిర్మించుకొని అందులో కాళికామాత విగ్రహాన్ని పెట్టి నిత్యం పూజలు చేస్తూ మంత్రాలతో పూనకం వచ్చినట్టు నటిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాడు. గతంలో మధురాపూర్ గ్రామంలో పూజలు చేయడంతో అక్కడి గ్రామస్తులు అతన్ని బెదిరించడంతో అక్కడి నుంచి షాద్ నగర్ పట్టణ సమీపంలోకి వచ్చారు. ప్రస్తుతం ఓ వెంచర్‌లో క్షుద్ర పూజలు చేస్తూ మంత్రాలతో మారు మోగిస్తున్నాడు. ఈ మాంత్రికుని వలన మోసపోయిన ఓ యువతి షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబం బాగాలేదని అతని దగ్గరికి వెళితే వేల రూపాయలు తీసుకొని మోసం చేశాడని, ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు తతంగం వెలుగులోకి వచ్చింది.
క్షుద్ర పూజలు చేసే వ్యక్తి ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు బయటపెట్టి, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షాద్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా తన వద్దకు వచ్చేలా మాయ మాటలతో చేస్తాడని, గత కొన్ని రోజుల క్రితం ఓ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల కోసం కొంత మందిని తన వెంట తీసుకెళ్ళాడని, అతని వద్ద ఉన్న బాధితులు ఒకొక్కరు బయటికి వస్తున్నారు. స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది బాధితులు అతడి వల్ల మోసపోయారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో బాధితులు బయటికి వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.