రూ. 150 కోసం ఇద్దరిని చంపిన వ్యక్తి అరెస్ట్

దిశ, వెబ్ డెస్క్: రూ. 150 కోసం ఫుట్ పాత్ పై భిక్షాటన చేసుకునే ఇద్దరిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలిసిన సమాచారం మేరకు.. నాంపల్లిలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ట్యాంక్ బండ్ ఎక్స్ రోడ్డు వద్ద భిక్షాటన చేసుకునే ఓ వ్యక్తిని నిందితుడు డబ్బులు అడుగడంతో ఇచ్చేందుకు అతను నిరాకరించాడని, దీంతో అతడిని తీవ్రంగా గాయపరిచి హత్యచేశాడని.. అనంతరం అతడి జేబులో రూ. 150 తీసుకుని అక్కడి […]

Update: 2021-11-05 21:45 GMT

దిశ, వెబ్ డెస్క్: రూ. 150 కోసం ఫుట్ పాత్ పై భిక్షాటన చేసుకునే ఇద్దరిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలిసిన సమాచారం మేరకు.. నాంపల్లిలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ట్యాంక్ బండ్ ఎక్స్ రోడ్డు వద్ద భిక్షాటన చేసుకునే ఓ వ్యక్తిని నిందితుడు డబ్బులు అడుగడంతో ఇచ్చేందుకు అతను నిరాకరించాడని, దీంతో అతడిని తీవ్రంగా గాయపరిచి హత్యచేశాడని.. అనంతరం అతడి జేబులో రూ. 150 తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. అదే రోజు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద మరో వ్యక్తి నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేశాడని, ఇచ్చేందుకు అతను కూడా నిరాకరించడంతో అతడిని కూడా హత్య చేసినట్లు సమాచారం. ఈ రెండు కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్న పోలీస్

Tags:    

Similar News