నిషేధం విధించిన ఈసీ.. నిరసనలో దీదీ
దిశ, వెబ్ డెస్క్ : బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బెంగాల్ సీఎం మమత.. ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్(ఈసీ) నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. మమతా బెనర్జీ కోల్‌కత్తాలోని గాంధీ ముర్తీ వద్ద బైఠాయించి తన నిరసన తెలియజేశారు. మమత.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం ఓట్లు, కేంద్ర బలగాలపై తిరగబడాలంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రచారం చేయడంపై నిషేధం విధించింది. ఈరోజు రాత్రి 8 నుంచి బుధవారం […]
దిశ, వెబ్ డెస్క్ : బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బెంగాల్ సీఎం మమత.. ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్(ఈసీ) నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. మమతా బెనర్జీ కోల్‌కత్తాలోని గాంధీ ముర్తీ వద్ద బైఠాయించి తన నిరసన తెలియజేశారు. మమత.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం ఓట్లు, కేంద్ర బలగాలపై తిరగబడాలంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రచారం చేయడంపై నిషేధం విధించింది. ఈరోజు రాత్రి 8 నుంచి బుధవారం రాత్రి 8 వరకు (24 గంటలు) మమత ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల సంఘం ఆదేశించింది.