మల్లన్న సాగర్ తరహా ప్యాకేజీ ఇవ్వాలి.. చర్లగూడెం భూనిర్వాసితులు డిమాండ్

దిశ చండూరు: మర్రిగూడ మండలంలో నిర్మాణంలో ఉన్న చర్లగూడెం రిజర్వాయర్ పనులను బుధవారం భూనిర్వాసితులు అడ్డుకున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు కొనసాగించడంపై భూ నిర్వాసితులు పనులు జరగకుండా వాహనాలను అడ్డుకున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 15 రోజుల్లో ఇస్తామని గ్రామంలో గ్రామసభ నిర్వహించి రైతుల దగ్గర సంతకాలు తీసుకొని మూడు నెలలు గడిచినా.. నేటివరకు ప్యాకేజీపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో భూ నిర్వాసితులను ఆగ్రహానికి గురి చేసింది. చర్లగూడెం, […]

Update: 2021-05-05 09:05 GMT

దిశ చండూరు: మర్రిగూడ మండలంలో నిర్మాణంలో ఉన్న చర్లగూడెం రిజర్వాయర్ పనులను బుధవారం భూనిర్వాసితులు అడ్డుకున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు కొనసాగించడంపై భూ నిర్వాసితులు పనులు జరగకుండా వాహనాలను అడ్డుకున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 15 రోజుల్లో ఇస్తామని గ్రామంలో గ్రామసభ నిర్వహించి రైతుల దగ్గర సంతకాలు తీసుకొని మూడు నెలలు గడిచినా.. నేటివరకు ప్యాకేజీపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో భూ నిర్వాసితులను ఆగ్రహానికి గురి చేసింది.

చర్లగూడెం, నర్సి రెడ్డి గూడెం గ్రామాల్లో భూ నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే పనులు నిర్వహించాలని, మల్లన్న సాగర్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనులు అడ్డగించిన వారిలో రైతులు అయితగొని వెంకటయ్య ,కాటంవెంకటయ్య ,పెరుమాండ్ల ఏ సోపు ,ఉపేందర్ ,లక్ష్మమ్మ ,నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News