ఉద్యోగుల సీనియారిటీ జాబితాను రూపొందించండి.. సీఎస్ సోమేష్ కుమార్
దిశ, మెదక్: సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఉద్యోగుల కేటాయింపు .317 జి.ఓ.పై జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును సమీక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఉద్యోగులందరికీ ప్రాధాన్యతనిస్తూ సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఆదేశించారు. సమయపాలన కచ్చితంగా పాటిస్తూ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాల్సినఅవసరం ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగులందరినీ కేటాయించి ఎవరూ మిగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. […]
దిశ, మెదక్: సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఉద్యోగుల కేటాయింపు .317 జి.ఓ.పై జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును సమీక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఉద్యోగులందరికీ ప్రాధాన్యతనిస్తూ సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
సమయపాలన కచ్చితంగా పాటిస్తూ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాల్సినఅవసరం ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగులందరినీ కేటాయించి ఎవరూ మిగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఉద్యోగులను వారి సొంత శాఖలో చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ హరీష్ మేడ్చల్ నుండి పాల్గొనగా, మెదక్ నుండి పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగి రేపటిలోగా మూడు ప్రిఫరెన్స్‌ల ప్రకారము ఆప్షన్ ఫారం శాఖాధిపతులకు అందజేయాలని సూచించారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్నా, అబ్సకాండింగ్‌లో ఉన్నా, సస్పెన్షన్లో ఉన్న ఎవరు మిస్ కాకుండా ఉద్యోగుల కేటాయింపు జరగాలని ఆమె సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ బాలస్వామి, జిల్లా పరిషత్ సీఈవో శైలేష్, డీఇఓ రమేష్ కుమార్, డీపీఓ తరుణ్ కుమార్, డీఎస్ ఓ శ్రీనివాస్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.