‘వ్యాక్సిన్ సరఫరా మరింత వేగవంతం అవుతుంది’
దిశ, వెబ్‌డెస్క్: మహీంద్రా గ్రూపునకు చెందిన థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవల సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ దేశీయంగా టీకా తయారీ సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరోనా వ్యాక్సిన్ సరఫరా స్పీడ్ అందుకుంటుందని మహీంద్రా లాజిస్టిక్స్ కంపెనీ ఆశిస్తోంది. కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వకు సంబంధించి నిర్దిష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగులు, రవాణా భాగస్వామ్యం ద్వారా అవసరాలను తీర్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ‘లాజిస్టిక్ పరిష్కారాల కోసం కొవిడ్-19 వ్యాక్సిన్‌ల […]
దిశ, వెబ్‌డెస్క్: మహీంద్రా గ్రూపునకు చెందిన థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సేవల సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ దేశీయంగా టీకా తయారీ సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరోనా వ్యాక్సిన్ సరఫరా స్పీడ్ అందుకుంటుందని మహీంద్రా లాజిస్టిక్స్ కంపెనీ ఆశిస్తోంది. కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వకు సంబంధించి నిర్దిష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగులు, రవాణా భాగస్వామ్యం ద్వారా అవసరాలను తీర్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ‘లాజిస్టిక్ పరిష్కారాల కోసం కొవిడ్-19 వ్యాక్సిన్‌ల తయారీలో ఉన్న భారతీయ ఔషధ సంస్థలతో చర్చలు కొనసాగిస్తున్నాము.
ఇప్పటికే వ్యాక్సిన్ సరఫరా లాజిస్టిక్ విభాగంలో ఉన్నాము. కొవిడ్-19 వ్యాక్సిన్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియ ప్రారంభించాం. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యాక్సిన్ సరఫరా మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నాం. మరిన్ని కంపెనీలకు నియంత్రణ ఆమోదాలు లభించే అవకాశాలున్నాయని’ మహీంద్రా లాజిస్టిక్స్ సీఈఓ రామ్‌ప్రవీణ్ స్వామినాథన్ చెప్పారు.