మహీంద్రా ఫైనాన్స్ స్వతంత్ర లాభం రూ. 156 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ స్వతంత్ర నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 156 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ పన్ను అనంతర లాభం రూ. 68 కోట్లు. ఏకీకృత ప్రాతిపదికన, ఈ త్రైమాసికంలో పన్ను తర్వాత రూ. 432 కోట్ల లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇది రూ. 108 కోట్లుగా ఉంది. వ్యయ నియంత్రణ, రుణాల […]
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ స్వతంత్ర నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 156 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ పన్ను అనంతర లాభం రూ. 68 కోట్లు. ఏకీకృత ప్రాతిపదికన, ఈ త్రైమాసికంలో పన్ను తర్వాత రూ. 432 కోట్ల లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇది రూ. 108 కోట్లుగా ఉంది. వ్యయ నియంత్రణ, రుణాల వ్యయాన్ని తగ్గించడం, ఎన్‌పీఏల పెరుగుదల ఎక్కువగా లేకపోవడం వంటి కారణాలతో కంపెనీ లాభాల్లో పెరుగుదల నమోదైందన్ని మహీంద్రా ఫైనాన్స్ వైస్ ఛైర్మన్, ఎండీ రమేష్ అయ్యర్ తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదని, జూన్‌లో కొంత వరకు పంపిణీ ప్రారంభమైందని రమేష్ అయ్యర్ వివరించారు.
వాహనాలు, ట్రాక్టర్లు, చిన్న వాహనాలకు డిమాండ్, ఫైనాన్స్ పెరుగుతుందని కంపెనీ అంచనా వేసింది. అంచనాలకు తగినట్టుగానే ట్రాక్టర్లకు, త్రీ-వీలర్ వాహనాల అమ్మకాల్లో వృద్ధి సాదించినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సరైన సమయంలో రుతుపవనాల రాక, ప్రభుత్వ ఉద్దీపన తదితర కార్యక్రమాల ద్వారా గ్రామీణంలో విక్రయాలు సానుకూలంగా ఉన్నాయని రమేష్ అయ్యర్ వివరించారు. తమ కస్టమర్లలో దాదాపు 75 శాతం మంది ఈఎంఐలపై మారటోరియం ఎంచుకోవడంతో తొలి త్రైమాసికంలో ప్రభావం అధికంగా ఉందని రమేష్ తెలిపారు. అయితే, జూన్ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని, మారటోరియం ఎంచుకున్న వారిలో చాలామంది గడువు కంటే ముందే చెల్లింపులు చేశారని కంపెనీ వెల్లడించింది.