మహేష్… నువ్వు దేవుడివి సామీ…

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు…. నిజంగా శ్రీమంతుడు సార్ మీరు అంటున్నారు ఫ్యాన్స్. మీ అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నామని ఆనందపడుతున్నారు. మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరని కీర్తిస్తున్నారు. ఖలేజా సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లు నిజంగా నువ్వు దేవుడివి స్వామి అంటూ అభినందిస్తున్నారు. కరోనాపై పోరుకు తన నుంచి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి ఇంతకు ముందే రూ. కోటి విరాళం అందించిన మహేష్… ఇప్పుడు తెలుగు సినీ కార్మికుల బాధలను చూసి […]

Update: 2020-03-28 04:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు…. నిజంగా శ్రీమంతుడు సార్ మీరు అంటున్నారు ఫ్యాన్స్. మీ అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నామని ఆనందపడుతున్నారు. మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరని కీర్తిస్తున్నారు. ఖలేజా సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లు నిజంగా నువ్వు దేవుడివి స్వామి అంటూ అభినందిస్తున్నారు. కరోనాపై పోరుకు తన నుంచి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి ఇంతకు ముందే రూ. కోటి విరాళం అందించిన మహేష్… ఇప్పుడు తెలుగు సినీ కార్మికుల బాధలను చూసి తట్టుకోలేక వారికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ కార్మికులకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించాడు. ఇతర సినీ ప్రముఖులు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలిచే ప్రయత్నంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాడు.

Tags : Mahesh Babu, Srimanthudu, CoronaVirus, Covid 19

Tags:    

Similar News