అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం.. మండిపడ్డ భారత్
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలోని వాషింగ్టన్‌లో గల భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు ఖలీస్థానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి వారు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అమెరికాలోని కొందరు సిక్కులు ఖలీస్థానీ జెండాలు ప్రదర్శించడంతో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి.అనంతరం ఖలీస్తానీ జెండాను గాంధీ విగ్రహంపై కప్పారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా, వేర్పాటు […]
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలోని వాషింగ్టన్‌లో గల భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు ఖలీస్థానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి వారు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా అమెరికాలోని కొందరు సిక్కులు ఖలీస్థానీ జెండాలు ప్రదర్శించడంతో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి.అనంతరం ఖలీస్తానీ జెండాను గాంధీ విగ్రహంపై కప్పారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా, వేర్పాటు వాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది.