Aryan Khan డ్రగ్స్ కేసు.. ఫేక్ సర్టిఫికెట్‌తో ఎన్సీబీ ఆఫీసర్ జాబ్

దిశ, సినిమా: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులకు దారితీస్తోంది. డ్రగ్స్ వినియోగమే కాక రవాణాలో ఆర్యన్‌కు అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయని భావిస్తూ బాంబే హైకోర్టు అతడికి బెయిల్ నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కేసు వ్యవహారంలో బడా పొలిటీషియన్స్ జోక్యం చేసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇదే క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ సమీర్ వాంఖడే లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరోవైపు మహారాష్ట్ర […]

Update: 2021-10-27 02:43 GMT

దిశ, సినిమా: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులకు దారితీస్తోంది. డ్రగ్స్ వినియోగమే కాక రవాణాలో ఆర్యన్‌కు అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయని భావిస్తూ బాంబే హైకోర్టు అతడికి బెయిల్ నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కేసు వ్యవహారంలో బడా పొలిటీషియన్స్ జోక్యం చేసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇదే క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ సమీర్ వాంఖడే లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరోవైపు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, వాంఖడేను టార్గెట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సమీర్ ఒక ముస్లిం అని, ఉద్యోగం కోసం దళితుడిగా నకిలీ పత్రాలు సృష్టించి అర్హుడైన దళితుడి ఉద్యోగాన్ని లాగేసుకున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సమీర్ నిఖా ఫొటోలు షేర్ చేసిన మంత్రి.. ‘స్వీట్ కపుల్ సమీర్ దావూద్ వాంఖడే, డాక్టర్ షబానా ఖురేషి’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న నెటిజన్లు.. ఆర్యన్ డ్రగ్స్ కేసును తప్పుదారి పట్టించేందుకే ఈ డ్రామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News