మహారాష్ట్ర హోం మినిస్టర్ రిజైన్
ముంబై: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించిన తర్వాత నైతిక బాధ్యతగా అనిల్ దేశ్‌ముఖ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇంకా హోం మంత్రి పదవిలో కొనసాగడం కరెక్ట్ కాదని ఎన్‌సీపీ నేత నవాల్ మాలిక్ అన్నారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నముంబై పోలీసు సచిన్ వాజేను నెలకు రూ. […]
ముంబై: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించిన తర్వాత నైతిక బాధ్యతగా అనిల్ దేశ్‌ముఖ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇంకా హోం మంత్రి పదవిలో కొనసాగడం కరెక్ట్ కాదని ఎన్‌సీపీ నేత నవాల్ మాలిక్ అన్నారు.
ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నముంబై పోలీసు సచిన్ వాజేను నెలకు రూ. 100 కోట్లు అక్రమంగా వసూళ్లు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హోం మినిస్టర్ అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐతో విచారణ చేయించాలని పరమ్ వీర్ సింగ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు తీర్పు రాగానే హోం మినిస్టర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాతో హోం శాఖ పోర్టుఫోలియో సీఎం ఉద్ధవ్ ఠాక్రే పరిధిలో ఉండనుంది.