లాక్‌డౌన్ విధింపుపై ‘మహా’ సీఎం కీలక ప్రకటన..
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహా సీఎం ఉద్ధవ్ థాక్రే వైరస్కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం వర్చువల్‌గా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో, మరో 2 రోజుల పాటు పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు రేపు టాస్క్ ఫోర్స్ సమావేశం కానుంది. […]
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహా సీఎం ఉద్ధవ్ థాక్రే వైరస్కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం వర్చువల్‌గా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో, మరో 2 రోజుల పాటు పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించాలని సీఎం నిర్ణయించారు.
ఈ మేరకు రేపు టాస్క్ ఫోర్స్ సమావేశం కానుంది. ఆ తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, థ్రాకే.. నిర్ణయాన్ని మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ సమర్థించాయి. కానీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ మాత్రం లాక్‌డౌన్ అంశాన్ని వ్యతిరేకించారు.