నాగార్జునకు వంద కోట్ల ఫైన్.. ఎందుకో తెలుసా?
దిశ, సినిమా: టాలీవుడ్ నటి మాధవీలత ఫస్ట్ సినిమా ‘నచ్చావులే’ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా వర్కౌట్ కాకపోవడంతో.. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం అలవాటు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు బిగ్ బాస్ షో వ్యవహారంపై ఫైర్ అయింది. హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఓ వ్యక్తిని సూసైడ్ చేసుకునే స్థాయిలో అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నటి.. ఈ రియాలిటీ షోలో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని […]
దిశ, సినిమా: టాలీవుడ్ నటి మాధవీలత ఫస్ట్ సినిమా ‘నచ్చావులే’ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా వర్కౌట్ కాకపోవడంతో.. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం అలవాటు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు బిగ్ బాస్ షో వ్యవహారంపై ఫైర్ అయింది. హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఓ వ్యక్తిని సూసైడ్ చేసుకునే స్థాయిలో అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నటి.. ఈ రియాలిటీ షోలో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది.
తనకు అధికారముంటే ఈ షోను పద్ధతి లేకుండా నడుపుతున్న యాజమాన్యానికి, హోస్ట్ నాగార్జునకు వంద కోట్ల ఫైన్ వేస్తానని చెప్పింది. ఈ వ్యవహారంపై సామాజిక కార్యకర్తలు, మీడియా స్పందించాలన్న మాధవి.. నాగచైతన్య- సమంత విడాకుల గురించి ఒక ప్రపంచ వింతలా టెలికాస్ట్ చేసిన న్యూస్ చానెల్స్ ఇలాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించింది. ప్రజాసంఘాల స్పందన కరువయినందుకు కారణమేంటో చెప్పాలని కోరింది.