లక్షన్నర మంది కార్మికులకు ఎల్&టీ రూ. 500 కోట్లు సాయం!

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాను అడ్డుకోవడానికి ప్రధానమంత్రి ప్రకటించిన సహాయ నిధికి రూ. 150 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్టు దేశీయ అతిపెద్ద నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) మంగళవారం ప్రకటించింది. కరోనాను అడ్డుకునేందుకు నిధులు, సమాజ సంక్షేమ ప్రణాళికలు, సహాయానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయంలో వేతనాలను చెల్లించి, కార్మికులకు అవసరమైన్న ఆహారం, ప్రాథమిక సదుపాయాలను అందించనున్నట్టు వెల్లడించింది. సుమారు 1.6 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులకు […]

Update: 2020-03-31 07:14 GMT
లక్షన్నర మంది కార్మికులకు ఎల్&టీ  రూ. 500 కోట్లు సాయం!
  • whatsapp icon

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాను అడ్డుకోవడానికి ప్రధానమంత్రి ప్రకటించిన సహాయ నిధికి రూ. 150 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్టు దేశీయ అతిపెద్ద నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) మంగళవారం ప్రకటించింది. కరోనాను అడ్డుకునేందుకు నిధులు, సమాజ సంక్షేమ ప్రణాళికలు, సహాయానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది.

అంతేకాకుండా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయంలో వేతనాలను చెల్లించి, కార్మికులకు అవసరమైన్న ఆహారం, ప్రాథమిక సదుపాయాలను అందించనున్నట్టు వెల్లడించింది. సుమారు 1.6 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా కంపెనీ నెలకు రూ. 500 కోట్ల నిధిని ప్రత్యేకంగా కేటాయించింది.

అలాగే, కంపెనీకి చెందిన శిక్షణా కేంద్రాలను, ఇతర ఎంపిక చేసిన ప్రదేశాలను ఐసోలేషన్ వార్డులుగా మార్చడానికి ఎల్ అండ్ టీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు ఆరోగ్య పరికరాలను సరఫరా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్టు తెలిపింది. తమ సంస్థకు చెందిన కమ్యూనిటీ హెల్త్ అండ్ మెడికల్ సెంటర్స్‌ను 24 గంటలూ ఉపయోగించుకోవాలని, వైరస్ సోకిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించడానికి ఆంబులెన్సులను ఉపయోగించడానికి ముందుకొచ్చింది.

Tags: Larsen & Toubro, L&T Donates Rs 150 Crore To PM Relief Fund, PM Relief Fund, Coronavirus Outbreak, AM Naik

Tags:    

Similar News