ఆ స్కీంలను రద్దు చేయాలి
దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ వహీద్ ఖాన్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా వాహిద్ మాట్లాడుతూ.. నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్ అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంలోని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌ల వల్ల పేద ప్రజలు ఇబ్బందులను […]
దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ వహీద్ ఖాన్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా వాహిద్ మాట్లాడుతూ.. నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్ అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంలోని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌ల వల్ల పేద ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రత్యేకంగా చట్టాన్ని ఏర్పాటు చేసుకొని పేద ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ విధానాలను రద్దు చేస్తుందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి టీఆర్ఎస్ పార్టీని బహిష్కరించాలని, అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.