మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఇప్పుడెంతంటే ?
న్యూఢిల్లీ: దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు బుధవారం మరోసారి పెరిగాయి. గృహావసరాల కోసం వినియోగించే రాయితీ సిలిండర్లపై రూ.25, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్లపై రూ.75 పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపాయి. దీంతో గృహావసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధర ఆయా నగరాలను బట్టి రూ.884 నుంచి రూ.911కు చేరింది. అలాగే, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర రూ.1,693 నుంచి రూ.1,770కు పెరిగింది. కాగా, గ్యాస్ సిలిండర్ల […]
న్యూఢిల్లీ: దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు బుధవారం మరోసారి పెరిగాయి. గృహావసరాల కోసం వినియోగించే రాయితీ సిలిండర్లపై రూ.25, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్లపై రూ.75 పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపాయి. దీంతో గృహావసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధర ఆయా నగరాలను బట్టి రూ.884 నుంచి రూ.911కు చేరింది. అలాగే, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర రూ.1,693 నుంచి రూ.1,770కు పెరిగింది. కాగా, గ్యాస్ సిలిండర్ల ధరలు 15రోజుల వ్యవధిలోనే రెండుసార్లు(రూ.50) పెరగడం గమనార్హం.
సబ్సిడీ సిలిండర్లపై ఆగస్టు 18నే రూ.25 పెంచగా, తాజాగా మరోసారి రూ.25 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతకుముందు జూలైలోనూ రూ.25.50 పెంచాయి. ఈ లెక్కన రెండు నెలల్లోనే వంట సిలిండర్లపై రూ.75 పెరిగాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) ధరల్లో ప్రతి నెలా సవరణలు జరుగుతాయి. వీటికి ప్రభుత్వాలు విధించే పన్నులు అదనంగా ఉంటాయి.