రైడర్స్ ముందు స్వల్ప స్కోరు
దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేసింది. ఓపెనర్లు సైతం బాల్ టు బాల్ రన్ కోసమే ప్రయత్నించారు. డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 36 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. బెయిర్ స్టో కూడా 10 బంతులను ఫేస్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే (51) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. మిడిలార్డర్ వృద్ధిమాన్ సాహా 31 […]
దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేసింది. ఓపెనర్లు సైతం బాల్ టు బాల్ రన్ కోసమే ప్రయత్నించారు. డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 36 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. బెయిర్ స్టో కూడా 10 బంతులను ఫేస్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే (51) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. మిడిలార్డర్ వృద్ధిమాన్ సాహా 31 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అప్పటికే కీలక వికెట్లను కోల్పోయిన హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా కోల్‌కతా బౌలర్లు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ల పై ఒత్తిడి తెచ్చి స్కోర్ బోర్డును కట్టడి చేశారు.