భయమే ప్రేమికులను చంపేసింది!

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెండ్లి చేసుకుని కలకాలం కలిసి జీవించాలని అనుకున్నారు. తీరా పెళ్లి విషయం ఇంట్లో చెప్పి పెద్దవారిని ఒప్పించేందుకు ధైర్యం సరిపోలేదు. ఎక్కడ వారు నో చెప్తారేమో అన్న భయం.. అంతేకాకుండా తమను విడదీస్తారేమోననే అ భద్రతా భావం కూడా కావొచ్చు. ఇలా అన్నింటికి భయపడ్డారు. చివరకు ఆ భయమే ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకెళ్లింది. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం […]

Update: 2020-08-05 10:01 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెండ్లి చేసుకుని కలకాలం కలిసి జీవించాలని అనుకున్నారు. తీరా పెళ్లి విషయం ఇంట్లో చెప్పి పెద్దవారిని ఒప్పించేందుకు ధైర్యం సరిపోలేదు. ఎక్కడ వారు నో చెప్తారేమో అన్న భయం.. అంతేకాకుండా తమను విడదీస్తారేమోననే అ భద్రతా భావం కూడా కావొచ్చు. ఇలా అన్నింటికి భయపడ్డారు. చివరకు ఆ భయమే ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకెళ్లింది. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం పిప్లా తండా అటవీ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకివెళితే.. లింగాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మడావి నాగు బాయి, జైనూర్ మండలం రాసిమెట్ల గ్రామానికి చెందిన ఆత్రం భీమ్ రావు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవచ్చనే భయంతో అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ పశువుల కాపరి చలనం లేకుండా పడి ఉన్న వీరిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న వారు ప్రేమికులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, రాసిమెట్లలో ఉన్న తన సోదరి వద్దకు వెళ్తున్నానని చెప్పిందని మృతురాలి తల్లి సోముబాయి వెల్లడించింది. ఈ మేరకు లింగాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరి మరణంతో ఇరువురి కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags:    

Similar News