లోన్లీగా చిల్డ్రన్స్
దిశ, శేరిలింగంపల్లి: పిల్లల్లో లోన్లీనెస్ పెరిగిపోయింది. ఎక్స్ ట్రా ఆక్టివిటీస్ కనుమరుగైపోయాయి. హౌస్ అరెస్ట్ అయి కుంగిపోతున్నారు. స్కూల్ ఉన్నప్పుడు హుషారుగా ఆడిపాడిన చిన్నారులు ఇప్పుడు కరోనా పుణ్యమా అని టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోయి లేజీగా మారిపోతున్నారు. చెప్పిన మాట వినకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటుండడంతో చీటికిమాటికి చికాకు పడుతున్నారు. ప్రతీ చిన్న విషయానికీ అరుస్తున్నారు. గోలగోల చేస్తున్నారు. పైగా తిన్నా తినకున్నా లావై పోతున్నారు. మునుపటి సంతోషాలు.., కేరింతలు కనిపించడం లేదు. మూడీగా […]
దిశ, శేరిలింగంపల్లి: పిల్లల్లో లోన్లీనెస్ పెరిగిపోయింది. ఎక్స్ ట్రా ఆక్టివిటీస్ కనుమరుగైపోయాయి. హౌస్ అరెస్ట్ అయి కుంగిపోతున్నారు. స్కూల్ ఉన్నప్పుడు హుషారుగా ఆడిపాడిన చిన్నారులు ఇప్పుడు కరోనా పుణ్యమా అని టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోయి లేజీగా మారిపోతున్నారు. చెప్పిన మాట వినకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటుండడంతో చీటికిమాటికి చికాకు పడుతున్నారు. ప్రతీ చిన్న విషయానికీ అరుస్తున్నారు. గోలగోల చేస్తున్నారు. పైగా తిన్నా తినకున్నా లావై పోతున్నారు. మునుపటి సంతోషాలు.., కేరింతలు కనిపించడం లేదు. మూడీగా ఉంటూ నిత్యం ఏదో కోల్పోయిన వారిలా కనిపిస్తున్నారు. పిల్లల పరిస్థితి చూసి పేరెంట్స్లోలోన మదన పడిపోతున్నారు.
స్కూల్ ఉన్నప్పుడు పిల్లలు ఉదయాన్నే లేచి కాసేపు చదువుకొని..ఆ తర్వాత చక్కగా రెడీ అయ్యి పాఠశాలకు పరుగులు పెట్టేవారు. సబ్జెక్ట్‌ల వారీగా క్లాసులు వింటూ లీజర్సమయంలో ఎంచక్కా ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఆడుకుంటూ ఆనందంగా గడిపేవారు. సాయంకాలం తిరిగి ఇంటికి రావడం.. ఫ్రెష్ అయ్యి ఆడుకోవడం.. చదువుకోవడం చేసేవారు. సమయానుగుణంగా పడుకోవడం లేవడం చేసేవారు. కానీ నేడు అంతా తారుమారైంది. పిల్లలు కాళ్లు కదపాలంటే భయం.., బయటకు వెళితే ఎక్కడ ఎవరిని కలుస్తారో.. వాళ్లకు ఏ జబ్బు ఉందో అన్న టెన్షన్. అలా అని పొద్దస్తమానం ఇంట్లోనే కూర్చోబెట్టి చదివించడం.. లేదా ఏదో ఒకటి ఆడుకోమని చెప్పి చేతిలో సెల్ ఫోన్ పెట్టడం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇలా ఏ ఒక్కరి ఇంట్లోనో కాదు.. పిల్లలు ఉన్న ప్రతీ ఇంట్లో ఇదే పరిస్థితి.
కరోనా కష్టాలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభనతో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఈఏడాది మార్చి 22 నుంచి పిల్లలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఏం చేయాలన్నా ప్రతిదానికీ కండీషన్. దీంతో స్వేచ్ఛగా ఆడిపాడాల్సిన పిల్లలు ఇప్పుడు ఆంక్షల మధ్య రోజులు గడుపుతూ ఒత్తిడికి గురవుతున్నారు. మునుపటిలా స్నేహితులను కలవలేకపోవడం, కలిసి ఆడుకోలేకపోవడం వల్ల వారిలో ఉషారు తగ్గింది. చీటికిమాటికి చికాకుపడుతున్నారు. చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. పిల్లల్లో ఈ ఆకస్మిక ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అయినవాళ్లతో చెప్పుకుని బాధ పడుతున్నారు. స్కూల్ కు పంపితే ఏమైనా మార్పు వస్తుందనుకున్నా ప్రభుత్వ నిబంధనలతో పాఠశాలలు తెరుచుకోకపోవడంతో చేసేదిలేక సర్దుకుపోతున్నారు.
పిల్లల్లో మానసిక ఒత్తిడి..
పిల్లలకు శారీరక శ్రమ, రెగ్యులర్ గా ఉండే స్నేహితులు అందుబాటులో లేకపోవడంతో వారిలో అనేక మార్పులు వస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రతిరోజూ పిల్లలు ఇంటి వద్ద లేదా బడిలో ఎంతోకొంత సమయం ఆడుకుంటారు. కానీ ఇప్పుడు ఏ ఆటలు లేవు. కేవలం చేతిలో సెల్ తప్పా.. ఏం ఆడినా, ఏం చేసినా సెల్ లోనే. అదీ ఇంట్లో కూర్చొనే. దీనివల్ల పిల్లలపై ఒత్తిడి పెరిగిపోతోంది. కనీసం ఎండకూడా పడక పోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడంతో పాటు ఒకేచోట కూర్చోవడం వల్ల వెయిట్ పెరిగిపోతున్నారు. ఎక్కువసేపు ఫోన్ చూడడం వల్ల మానసిక ఒత్తిడి, అలసట తప్పా ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఆటలు ఆడడం వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్ లాంటి పలు హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచి, మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. అంతేకాదు ఆటల వల్ల శరీరం అలసి మంచి నిద్ర కూడా వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థుల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. శారీరక శ్రమ అస్సలు లేదు. ఎప్పుడు పడుకుంటున్నారో.. ఎప్పుడు లేస్తున్నారో.. ఎప్పుడు తింటున్నారో.. వారికే తెలియడం లేదు. వేళాపాళా లేని జీవనశైలి వల్ల చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతున్నారు.
చీటికిమాటికి చికాకు
నగరంలో అధిక శాతం పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలే. వీరిలో చాలామందివి చిన్నచిన్న అద్దె ఇళ్లే. కరోనా సమయంలో బయటికి వెళితే.. ప్రాణాల మీదకు వస్తుందన్న భయంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపండలేదు. ఎప్పుడూ ఆడిపాడుతూ ఉండే విద్యార్థులను ఇప్పుడు కట్టిపడేసినట్టు ఉంచడం వల్ల ఈరకమైన లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు వైద్యులు. అయితే తల్లిదండ్రులు ఇలాంటి వాటికి కుంగిపోకుండా పిల్లల పరిస్థితిని అర్థం చేసుకుని, అనునయించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
ఇలా చేస్తే..
- ముఖ్యంగా కరోనా వైరస్ తదనంతర పరిస్థితులపై వారి భయాల్ని పోగొట్టాలి.
- ఆన్ లైన్ క్లాసులు ముగిసిన వెంటనే చదువు అంటూ పదేపదే పోరుపెట్టకూడదు.
- ఒకవేళ పిల్లలు సబ్జెక్టు అర్థం కాలేదని చికాకు పడుతుంటే.. ఉపాధ్యాయులతో మాట్లాడించి వారి అనుమానాలను నివృత్తి చేయాలి.
- పనుల్లో ఎంత బిజీగా ఉన్న ప్రతిరోజూ పిల్లలతో కొంతసేపైనా గడపాలి.
- ఆహార పదార్థాలు, ఇతర తినుబండారాల విషయంలో కాస్త శ్రద్ధ చూపించాలి.
- తల్లిదండ్రులు తమ పిల్లలకు కథలు వినిపించడం, రాయమని ప్రోత్సహించడం చేయాలి.
- ఇలా చేయడం వల్ల పిల్లల్లో మార్పు వస్తుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
స్కూల్ఉంటే బాగుండు..
స్కూల్ ఉంటేనే బాగుండేది. ఫ్రెండ్స్ అందరూ కలిసేవారు. బాగా చదువుకునే వాళ్లం. చక్కగా ఆడుకునే వాళ్లం. కరోనా వల్ల చాలా డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. మమ్మీడాడి బయటకు వెళ్లనీయడం లేదు. ఎంతసేపు స్టడీస్, స్టడీస్ తప్పా వేరే ఏమీలేదు. మా ఫ్రెండ్స్ ను చూడక చాలా రోజులవుతోంది. స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఏమో.
-శ్రీహర్షిత, విద్యార్థిని
చాలా బోర్ గా ఉంది
స్కూల్ లేక ఇంటి దగ్గరే ఉంటున్నాం. ఫోన్ లో క్లాస్ లు వింటున్నాం. చాలా బోర్ గా ఉంది. స్కూల్ ఉన్నప్పుడు క్రికెట్ ఆడుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ఫోన్ లో గేమ్స్, టీవీలో కార్టూన్స్, మూవీస్ చూస్తూ మా చెల్లితో కలిసి చదువుకుంటున్నాం. సబ్జెక్స్ట్ లో డౌట్ వచ్చినా ఎవరూ చెప్పట్లేదు. మమ్మీ, డాడీ ఇద్దరూ డ్యూటీకి వెళ్తారు. ఇంట్లో మేమే ఉంటాం. చాలా లోన్లీగా ఉంది. ఎగ్జామ్స్ ఎలా రాయాలో ఏమో. పిల్లలను సఫర్అవుతున్నారు.
-లివింగ్స్టన్, విద్యార్థి
పిల్లలు సఫర్ అవుతున్నారు
మా పిల్లలను చూస్తే చాలా బాధగా ఉంది. కరోనా ఎఫెక్ట్ వల్ల స్కూల్స్ క్లోజ్ అయినప్పటి నుంచి వాళ్లు చాలా సఫర్ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో మా పిల్లలను ఎక్కడికీ పంపడం లేదు. వాళ్లకు ఒక ఆటాలేదు. బయటకు వెళ్లడం లేదు. గతంలో ఆదివారం వస్తే సిటీలో ఏదో ఒక ప్లేస్ కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపలేక పోతున్నాం. అయినా వాళ్ల చదువులకంటే కూడా పిల్లల ఆరోగ్యమే ఇంపార్టెంట్. కాస్త కష్టంగా ఉన్నా భరిస్తూ వాళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం.
-నరేశ్, పేరెంట్