రమ్య హత్యలో నిందితుడికి ఉరి ఎప్పుడు: నారా లోకేశ్

దిశ,ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. దిశ చట్టంతో ముగ్గురికి ఉరి శిక్ష, 20 మందికి కఠిన జైలు శిక్ష పడింది అంటూ వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మహిళా హోంమంత్రి సుచరిత ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారంటూ లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. దిశ చట్టంతో ఉరి శిక్ష పడ్డ వారి పేర్లు బయట పెట్టే దమ్ముందా జగన్ ? అంటూ నిలదీశారు. ఇంకా 3 […]

Update: 2021-09-07 12:07 GMT

దిశ,ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. దిశ చట్టంతో ముగ్గురికి ఉరి శిక్ష, 20 మందికి కఠిన జైలు శిక్ష పడింది అంటూ వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మహిళా హోంమంత్రి సుచరిత ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారంటూ లోకేశ్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. దిశ చట్టంతో ఉరి శిక్ష పడ్డ వారి పేర్లు బయట పెట్టే దమ్ముందా జగన్ ? అంటూ నిలదీశారు. ఇంకా 3 రోజులే మిగిలాయి బీటెక్ విద్యార్థిని రమ్యని దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపిన వాడికి ఉరి వేసేది ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు. దిశ చట్టానికి ప్రచారం అంటూ సొంత మీడియాకి యాడ్స్ ఇచ్చుకొని కొట్టేసిన రూ.30 కోట్లు పోలీసు వ్యవస్థ బలోపేతం కోసం వినియోగించి ఉంటే పరిస్థితి కొంతయినా మెరుగుపడేది అంటూ నారా లోకేశ్ ట్విటర్ వేదికగా హితవు పలికారు.

Tags:    

Similar News