కరోనా నిర్మూలన అయ్యే వరకు లాక్‌డౌన్
దిశ, వరంగల్: ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ళను వీడొద్దని, కరోనా నిర్మూలనకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని రాయపర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. తిరుమలాయపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాయపర్తి వీధుల్లో సోడియం హైపో […]
దిశ, వరంగల్: ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ళను వీడొద్దని, కరోనా నిర్మూలనకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని రాయపర్తి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. తిరుమలాయపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాయపర్తి వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్‌ను స్వయంగా మంత్రి పిచికారీ చేశారు. ప్రజలకు మాస్కుల పంపిణీ, పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా చోట్ల ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు గుళ్ళు, మసీదులు, చర్చీలకు వెళ్ళడాన్ని మానేయాలన్నారు. కరోనా నిర్మూళన జరిగే వరకు కంప్లీట్ లాక్‌డౌన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగకుండా చూడాలన్నారు. దురదృష్టవశాత్తు కొందరు ఢిల్లీకి వెళ్ళి రావడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, స్వచ్ఛందంగా పరీక్షలకు వెళ్ళకుండా ఉండటం వంటి కారణాల వల్ల కరోనా విస్తృతి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందుకు తగ్గట్టుగా అనేక ఏర్పాట్లు చేసిందన్నారు. అయితే కరోనా నిర్మూళనకు చికిత్సకంటే అది రాకుండా చూసుకోవడమే మంచిదన్నారు. అందుకే ప్రజలు మరికొంత కాలం లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా పాటించాలని మంత్రి సూచించారు. ప్రజలు పారిశుధ్యాన్ని పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ అడిషనల్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Tags: Lockdown, corona, outbreak, completely, WARANGAL, MINISTER ERRABELLI