దేశవ్యాప్తంగా జూన్ 30వరకు లాక్‌డౌన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఐదవ విడత లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉ. 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్‌లల్లో జూన్ 30 వరకు కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. ఈ జోన్‌లల్లో కేవలం అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. […]
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఐదవ విడత లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉ. 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్‌లల్లో జూన్ 30 వరకు కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. ఈ జోన్‌లల్లో కేవలం అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. జూన్ 8 నుంచి అన్ని ఆలయాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్ తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. విద్యాసంస్థలు తెరవడంపై జూలైలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మెట్రో, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా, సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, ఆడిటోరియాలు, పార్కులు, సభలు, మత పరమైన సమావేశాలపై నిషేధం కొనసాగనుంది.