అష్టదిగ్బంధనంలో శ్రీకాళహస్తి

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. దీంతో పట్టణంలోని అన్ని రోడ్లను అష్టదిగ్బంధనం చేశారు అధికారులు. కేవలం 80 వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో 40కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పట్టణంలో ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాలను వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే అందిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఉదయం మూడు గంటల వెసులుబాటును కూడా పూర్తిగా రద్దు […]

Update: 2020-04-23 22:35 GMT

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. దీంతో పట్టణంలోని అన్ని రోడ్లను అష్టదిగ్బంధనం చేశారు అధికారులు. కేవలం 80 వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో 40కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పట్టణంలో ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాలను వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే అందిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఉదయం మూడు గంటల వెసులుబాటును కూడా పూర్తిగా రద్దు చేశారు. పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. ఏదైనా అత్యవసరం ఉంటే వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Tags: srikalahasti, lockdown, carona, ap

Tags:    

Similar News