రూల్స్​ మరింత కఠినం

– డ్రోన్లతో పోలీసుల సర్వే – లాక్​డౌన్​ వయొలెన్స్​ అప్లికేషన్​తో మానిటరింగ్​ – నిబంధనలు పాటించకుంటే రెండేళ్ల జైలు, జరిమానా – ఇష్టమున్నట్టు బండ్లపై బయటికొస్తే వేహికల్​ జప్తు హైదరాబాద్​: కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.అందులో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలును ఇంకా కొంతమంది అతిక్రమిస్తున్న నేపధ్యంలో సైబరాబాద్ పోలీసులు రూల్స్​ బ్రేక్​ చేస్తున్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ఇప్పటికే 478 కేసులు నమోదు చేసిన పోలీసులు వేలాది […]

Update: 2020-04-10 22:04 GMT

– డ్రోన్లతో పోలీసుల సర్వే
– లాక్​డౌన్​ వయొలెన్స్​ అప్లికేషన్​తో మానిటరింగ్​
– నిబంధనలు పాటించకుంటే రెండేళ్ల జైలు, జరిమానా
– ఇష్టమున్నట్టు బండ్లపై బయటికొస్తే వేహికల్​ జప్తు

హైదరాబాద్​: కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.అందులో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలును ఇంకా కొంతమంది అతిక్రమిస్తున్న నేపధ్యంలో సైబరాబాద్ పోలీసులు రూల్స్​ బ్రేక్​ చేస్తున్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ఇప్పటికే 478 కేసులు నమోదు చేసిన పోలీసులు వేలాది వాహనాలను జప్తు చేశారు. నగరం మొత్తం మీద 7లక్షల పైగా ఉన్న సీసీటీవీ కెమెరాలలో, సైబరాబాద్​లో ఉన్న లక్షా 15 వేల కెమెరాలను కమాండ్ కంట్రోల్​కి అనుసంధానం చేశారు. వీటి ద్వారా రోడ్ల మీద ప్రజల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పలు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ప్రజల కదలికలు పసిగట్టి చర్యలు తీసుకుంటున్నారు. పోలీసుల అమ్ముల పొదిలో మరో సాంకేతిక అస్త్రం జత అయ్యింది. ఇదే ‘లాక్ డౌన్ వయొలేషన్ ట్రాకింగ్ అప్లికేషన్’. దీన్ని తెలంగాణ పోలీసు శాఖ తయారు చేయగా.. అన్ని చెక్ పోస్టుల్లో ఉన్న అధికారులకు టాబ్ లలో ఇన్​స్టాల్​ చేశారు. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్ మీదకు వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న పోలీసు అధికారి అతని వివరాలు టాబ్ లో నమోదు చేస్తున్నారు.

రూల్స్​ అతిక్రమిస్తే రెండేళ్ల జైలు, జరిమాన

ఎవరైనా ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే అది కూడా కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే బయటకు వెళ్లవచ్చు. నిబంధనల ప్రకారం మోటార్ సైకల్ పై ఒక వ్యక్తి, కార్ లో డ్రైవరు కాక మరో వ్యక్తికి మాత్రమే పర్మిషన్​ ఉంది. ఒకవేళ ఎవరైనా మూడు కిలోమీటర్ల పరిధిని దాటినట్లైతే వాని వూహికల్​ జప్తు చేసి, వారిపై ‘జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం’, ‘అంటువ్యాధుల నివారణ చట్టం’ ఇండియన్​ పీనల్​ కోడ్​మేరకు కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని అతిక్రమించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా పడే అవకాశం ఉంది. జప్తు చేసిన వాహనం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం ఉండదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఎవరైనా అనవసరంగా రోడ్ల మీదకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరంగా రావాల్సి వస్తే, నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. ప్రతి చిన్న అవసరానికి బయటకు రాకుండా కనీసం రెండు మూడు రోజుల పాటు సరిపోయేలా అన్ని రకాల నిత్యావసరాలను ఒకేసారి కొనుగోలు చేసుకోవాలని, బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన వారు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలంటన్నారు.

Tags:    

Similar News