పరిశ్రమలు, సేవా రంగాలకు లాక్‌డౌన్ సడలింపు

దిశ, తెలంగాణ బ్యూరో : పరిశ్రమలు, సేవా రంగాలకు లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. మంగళవారం కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా పరిశ్రమలు, అనుబంధ కార్యకలాపాలు, సేవా రంగాలు సజావుగా సాగేందుకు నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను జారీ చేశారు. అన్ని పరిశ్రమలు లాక్ సడలింపు ఉంటుందని, కొవిడ్ నిబంధనలు అనుసరించి పనిచేయాలని సూచించారు. టెలీ కమ్యూకేషన్, ఇంటర్నెట్ సేవలు, బ్రాడ్ కాస్టింగ్ సేవలు, మెడికల్, ఫైనాన్షియల్, […]

Update: 2021-05-11 11:34 GMT
Jayesh Ranjan
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : పరిశ్రమలు, సేవా రంగాలకు లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. మంగళవారం కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా పరిశ్రమలు, అనుబంధ కార్యకలాపాలు, సేవా రంగాలు సజావుగా సాగేందుకు నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను జారీ చేశారు. అన్ని పరిశ్రమలు లాక్ సడలింపు ఉంటుందని, కొవిడ్ నిబంధనలు అనుసరించి పనిచేయాలని సూచించారు.

టెలీ కమ్యూకేషన్, ఇంటర్నెట్ సేవలు, బ్రాడ్ కాస్టింగ్ సేవలు, మెడికల్, ఫైనాన్షియల్, ట్రాన్స్ ఫోర్టు, డాటా సెంటర్లు , ఐటీ మౌలిక సదుపాయాల నిర్వహణకు అనుమతి నిచ్చారు. అదే విధంగా కోల్డు స్టోరేజ్ మరియు గిడ్డంగుల సేవలు, వస్తువులు మరియు కార్మికుల రవాణా, గృహ, పరిశ్రమలకు గ్యాస్ సరఫరా, అన్ని ఈ కామర్స్ మరియు హోం డెలివరీ సేవలను పంపిణీ, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ సేవలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.

500ల మంది పనిచేసే కర్మాగారాలు, యూనిట్లలో కంపెనీ యజమానులు నిర్బంధ సౌకర్యాలతో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. కార్మికులు పరిశ్రమ ఆవరణలో ఉండేలా యజమానులు చర్యలు తీసుకోవాలని, వారి రక్షణ బాధ్యత వారిదే అన్నారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు, సిబ్బందికి ఐడీకార్డులు ఇవ్వాలని, సంబంధిత పరిశ్రమలు జారీ చేసిన అనుమతి లేఖకు కార్మికులు అవసరం నిమిత్తం బయటకు వచ్చేటప్పుడు వెంట ఉంచుకోవాలని సూచించారు.

Tags:    

Similar News