బంగ్లాదేశ్‌లో మళ్లీ లాక్ డౌన్

ఢాకా: బంగ్లాదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోమారు లాక్ డౌన్ దిశగా బంగ్లాదేశ్ అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి, అవామీలీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదర్ ధృవీకరించారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. దేశంలో కొవిడ్-19 కొత్త వేవ్‌ను అదుపులోకి తెచ్చేందుకు ఏప్రిల్ 5 నుంచి లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై పబ్లిక్ […]

Update: 2021-04-03 01:46 GMT

ఢాకా: బంగ్లాదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోమారు లాక్ డౌన్ దిశగా బంగ్లాదేశ్ అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి, అవామీలీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదర్ ధృవీకరించారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. దేశంలో కొవిడ్-19 కొత్త వేవ్‌ను అదుపులోకి తెచ్చేందుకు ఏప్రిల్ 5 నుంచి లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పర్హద్ హుస్సేన్ శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… లాక్ డౌన్‌లో భాగంగా ప్రతీ ఆఫీసుతో పాటు కోర్టులను కూడా మూసివేయనున్నట్టు తెలిపారు. కానీ పరిశ్రమలు, మిల్లులు మాత్రం రొటేషన్ పద్దతిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయని వెల్లడించారు.

Tags:    

Similar News