DGP Mahender Reddy: లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది: డీజీపీ

దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టును రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జానర్‌లు సందర్శించారు. గురువారం ఉదయం 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను పరిశీలించారు. పోలీసు అధికారులకు లాక్ డౌన్ అమలు తీసుకోవాల్సిన చర్యలపై డిజిపి మహేందర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నగరంలో చాలా వరకు లాక్ డౌన్ విజయవంతంగా […]

Update: 2021-05-27 01:45 GMT
DGP Mahender Reddy: లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది: డీజీపీ
  • whatsapp icon

దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టును రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జానర్‌లు సందర్శించారు. గురువారం ఉదయం 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను పరిశీలించారు. పోలీసు అధికారులకు లాక్ డౌన్ అమలు తీసుకోవాల్సిన చర్యలపై డిజిపి మహేందర్ రెడ్డి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నగరంలో చాలా వరకు లాక్ డౌన్ విజయవంతంగా అమలు అవుతుందన్నారు. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో కూడా అమలుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించినంత కాలం పకడ్బందీగా అమలు చేస్తామన్నారు .ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News