ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు..

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మరో పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. ప్రతీరోజు ఉదయం ఆరు గంటల మొదలు సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షలకు సడలింపు ఉంటుందని, ఆ తర్వాత పన్నెండు గంటల పాటు లాక్‌డౌన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రానున్న పది రోజుల పాటు ఈ విధానం కొనసాగనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ మంగళవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో […]

Update: 2021-06-08 09:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మరో పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. ప్రతీరోజు ఉదయం ఆరు గంటల మొదలు సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షలకు సడలింపు ఉంటుందని, ఆ తర్వాత పన్నెండు గంటల పాటు లాక్‌డౌన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రానున్న పది రోజుల పాటు ఈ విధానం కొనసాగనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ మంగళవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన మంత్రివర్గం మరో పది రోజుల పాటు (జూన్ 18 వరకు) లాక్‌డౌన్ కొనసాగించాలని నిర్ణయించింది. ఆ ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్‌‌లాక్, ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు లాక్‌డౌన్ (కర్ఫ్యూ) అమలుకానున్నది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిందిగా పోలీసు శాఖకు కేబినెట్ నొక్కిచెప్పింది.

ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికీ ఒకే విధంగా ప్రతీరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌‌డౌన్ అమలవుతున్నది. తాజాగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో పన్నెండు గంటల సడలింపు, మరో పన్నెండు గంటల ఆంక్షలు అమలుకానున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు కలిగిన నియోజకవర్గాలతో పాటు వైరస్ వ్యాప్తి ఇంకా ఆశించని స్థాయిలో అదుపులోకి రాని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, సత్తుపల్లి, మధిర, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో మాత్రం యధావిధిగా ఇప్పుడు కొనసాగుతున్నట్లుగానే ఇకపైన కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మినహా మిగిలిన సమయమంతా లాక్‌‌డౌన్ అమలుకానున్నది.

ఈ ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడితో కూడిన వైద్య బృందం ఇటీవల హెలికాప్టర్ పర్యటనలు చేసి ఆ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ, కొత్త కేసుల నమోదు, ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్ల వివరాలు తదితరాలను సమీక్షించి మరికొన్ని రోజుల పాటు ఆంక్షలను అమలుచేయాల్సిన అవసరం ఉన్నదని భావించింది. ఆ ప్రకారమే కేబినెట్ సమావేశానికి నివేదిక సమర్పించింది. దాన్ని అధ్యయనం చేసిన మంత్రివర్గం ప్రస్తుత లాక్‌డౌన్‌ను యధాతథంగా అమలు చేయడమే ఉత్తమమనే నిర్ణయాన్ని తీసుకున్నది.

ప్రభుత్వాస్పత్రుల డెవలప్‌‌మెంట్‌కు కేబినెట్ సబ్ కమిటీ

ఒకవైపు థర్డ్ వేవ్ రావచ్చన్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సర్కారు ఆస్పత్రులను మెరుగుపర్చాలని, సకల సౌకర్యాలను కల్పించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హరీశ్‌రావు అద్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఈ సబ్ కమిటీలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు సభ్యులుగా ఉంటారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్‌కు, బెడ్‌లకు, మందులకు కొరత ఏర్పడిన దృష్ట్యా ఇకపైన పునరావృతం కాకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ఈ సబ్ కమిటీని నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు ఉత్తమమైన వైద్య ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్ళి అధ్యయనం చేసి రావాలని, ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.

Tags:    

Similar News