మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు

ముంబయి: మూడో దశ లాక్‌డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌‌‌డౌన్‌ ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ లాక్‌‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు ప్రకటించనుంది. అయితే, అంతకంటే ముందే ఉద్ధవ్ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ పొడిగించింది. లాక్‌డౌన్‌కు సంబంధించిన సడలింపుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆ రాష్ట్ర సీఎస్ […]

Update: 2020-05-17 04:44 GMT

ముంబయి: మూడో దశ లాక్‌డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌‌‌డౌన్‌ ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ లాక్‌‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు ప్రకటించనుంది. అయితే, అంతకంటే ముందే ఉద్ధవ్ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ పొడిగించింది. లాక్‌డౌన్‌కు సంబంధించిన సడలింపుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆ రాష్ట్ర సీఎస్ అజయ్ మెహతా వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో మూడోవంతు మహారాష్ట్రలోనే నమోదవడం గమనార్హం.

Tags:    

Similar News