కరోనాతో తగ్గిన తేయాకు ఉత్పత్తి!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో భారత్‌లో ఏప్రిల్ నెలకు తేయాకు ఉత్పత్తి 54 శాతం తగ్గి 3.9 కోట్ల కిలోలకు పడిపోయిందని ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే టీ బోర్డు సోమవారం తెలిపింది. అస్సాంలో ఒకటే ఏప్రిల్ నెల ఉత్పత్తి 76 శాతం తగ్గి 1.09 కోట్ల కిలోలకు పడిపోయినట్టు బోర్డు వెల్లడించింది. 2020 సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో భారత్‌లో 11.33 కోట్ల కిలోల తేయాకు ఉత్పత్తి మాత్రమే […]

Update: 2020-07-06 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో భారత్‌లో ఏప్రిల్ నెలకు తేయాకు ఉత్పత్తి 54 శాతం తగ్గి 3.9 కోట్ల కిలోలకు పడిపోయిందని ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే టీ బోర్డు సోమవారం తెలిపింది. అస్సాంలో ఒకటే ఏప్రిల్ నెల ఉత్పత్తి 76 శాతం తగ్గి 1.09 కోట్ల కిలోలకు పడిపోయినట్టు బోర్డు వెల్లడించింది. 2020 సంవత్సరంలో తొలి నాలుగు నెలల్లో భారత్‌లో 11.33 కోట్ల కిలోల తేయాకు ఉత్పత్తి మాత్రమే జరిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున ఏడాది క్రితంతో పోలిస్తే 40 శాతం తగ్గినట్టు బోర్డు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తేయాకు ఉత్పత్తిదారైన భారత్ ప్రధానంగా సీటీసీ గ్రేడ్ రకాన్ని ఈజిప్ట్, పాకిస్తాన్, యూకేలకు ఎగుమతి చేస్తుంది. ఇరాక్, ఇరాన్, రష్యాలకు సనాతన రకాలను రవాణా చేస్తుంది. మొత్తంగా 2020 ఏడాదికి భారత్‌లో 12 కోట్ల కిలోలు అంటే 9 శాతం తేయాకు ఉత్పత్తి తగ్గే అవకాశముందని టీ బోర్డు వెల్లడించింది.

Tags:    

Similar News