కొంప ముంచిన కొవిడ్ మంచి!
ప్రతి విషయాన్ని చెడుగా ఎందుకు చూడటం, దానిలో కూడా ఎంతో కొంత మంచి దాగుంటుందనే దృక్పథంతో కరోనా వైరస్ వల్ల కలిగిన ప్రయోజనాలను వార్తా వెబ్‌సైట్లు వల్లె వేశాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఒకటి ఉంది. కొవిడ్ 19 వ్యాప్తి చెందకుండా విధించిన లాక్‌డౌన్ కారణంగా రోడ్ల మీద ప్రయాణాలు, ఫ్యాక్టరీల్లో ఉత్పత్తుల తయారీ ఆగిపోవడంతో కర్బన ఉద్గారాలు తగ్గాయని, తద్వారా పర్యావరణానికి మంచి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది నుంచి వాతావరణ […]
ప్రతి విషయాన్ని చెడుగా ఎందుకు చూడటం, దానిలో కూడా ఎంతో కొంత మంచి దాగుంటుందనే దృక్పథంతో కరోనా వైరస్ వల్ల కలిగిన ప్రయోజనాలను వార్తా వెబ్‌సైట్లు వల్లె వేశాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఒకటి ఉంది. కొవిడ్ 19 వ్యాప్తి చెందకుండా విధించిన లాక్‌డౌన్ కారణంగా రోడ్ల మీద ప్రయాణాలు, ఫ్యాక్టరీల్లో ఉత్పత్తుల తయారీ ఆగిపోవడంతో కర్బన ఉద్గారాలు తగ్గాయని, తద్వారా పర్యావరణానికి మంచి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే వచ్చే ఏడాది నుంచి వాతావరణ మార్పుల్లో ఎలాంటి తేడా ఉండదని, ఇక గ్లోబల్ వార్మింగ్ గురించి భయపడాల్సిన అవసరమేలేదని అందరూ చంకలు గుద్దుకున్నారు. కానీ ఆ ఆనందమంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఎలాగంటారా?
పాండమిక్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో విధించిన లాక్‌డౌన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రయోజనం లేదని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. లాక్‌డౌన్ విధించిన నాలుగు నెలల కాలంలో కర్బన ఉద్గారాల విడుదల గణనీయంగా తగ్గిన మాట నిజమే కానీ, దూరదృష్టితో చూస్తే ఇది గ్లోబల్ వార్మింగ్‌లో 0.001 శాతం ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఉపయోగపడదని తేల్చిచెప్పారు. దాదాపు 120 దేశాల్లో ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య విడుదలైన పది గ్రీన్‌హౌస్ వాయువులు, గాలి కాలుష్య కారకాల డేటా నుంచి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని సంగ్రహించారు. ఈ డేటా ఆధారంగా కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ విడుదల 10 నుంచి 30 శాతం తగ్గిందని, దీని వల్ల స్థూల నివేదికల్లో ఎలాంటి మార్పు రాలేదని ప్రిస్ట్లీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లైమెట్ ప్రొఫెసర్ పియర్స్ ఫోర్స్‌స్టర్ అన్నారు. కాకపోతే ఇవే ప్రయాణ నిబంధనలు, సామాజిక దూరం నియమాలను 2021 డిసెంబర్ వరకు పాటిస్తే మాత్రం 2030 నాటికి 0.01 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.