రిస్క్ చేసిన ఎస్ఐ.. స్థానికుల అభినందనలు
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో పొలం దమ్ము చేస్తూ ట్రాక్టర్‌తో సహా డ్రైవర్ గుండెపంగు వీరస్వామి(30) వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఎవరూ బావిలోకి దిగే సాహసం చేయలేకపోయారు. ధైర్యం చేసి, ఒకరిద్దరు బావిలోకి దిగినా ఫలితం లేకపోయింది. అయితే అప్పటికే వీరస్వామి మరణించి, ట్రాక్ట్రర్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోవడంతో అతన్ని బయటకు తీయడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థాలానికి […]
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో పొలం దమ్ము చేస్తూ ట్రాక్టర్‌తో సహా డ్రైవర్ గుండెపంగు వీరస్వామి(30) వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఎవరూ బావిలోకి దిగే సాహసం చేయలేకపోయారు. ధైర్యం చేసి, ఒకరిద్దరు బావిలోకి దిగినా ఫలితం లేకపోయింది. అయితే అప్పటికే వీరస్వామి మరణించి, ట్రాక్ట్రర్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోవడంతో అతన్ని బయటకు తీయడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థాలానికి చేరుకున్న మేళ్లచెరువు ఎస్‌ఐ చలికంటి నరేష్ రాత్రి 10 గంటలకు స్వయంగా బావిలోకి దిగారు. రెండు గంటల పాటు శ్రమంచి, చివరకు జేసీబీ సాయంతో బయటకు తీసారు. ఈ నేపథ్యంలో డ్యూటీని మించి మానవత్వాన్ని ప్రదర్శించిన ఎస్‌ఐను స్థానికులు అభినందించారు.