మంత్రి ఎర్రబెల్లికి మరో షాక్.. నడిరోడ్డు మీద సీన్ రిపీట్
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లికి మరో షాక్ తగిలింది. జనగామ జిల్లా పాలకుర్తి నుంచి వరంగల్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న దయాకర రావు సరిగ్గా స్టేషన్ ఘన్‌పూర్ చేరుకోగానే వ్యాపారస్తులు కాన్వాయ్‌కు అడ్డుతగిలారు. గతేడాదిగా రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేట్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నేటికి పూర్తి కావడం లేదన్నారు. గత నెల 30న కూడా […]
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లికి మరో షాక్ తగిలింది. జనగామ జిల్లా పాలకుర్తి నుంచి వరంగల్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న దయాకర రావు సరిగ్గా స్టేషన్ ఘన్‌పూర్ చేరుకోగానే వ్యాపారస్తులు కాన్వాయ్‌కు అడ్డుతగిలారు. గతేడాదిగా రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేట్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నేటికి పూర్తి కావడం లేదన్నారు. గత నెల 30న కూడా కాన్వాయ్‌ను ముట్టడించామని.. అయినప్పటికీ పనుల్లో పురోగతి లేదని.. అందుకే మరోసారి అడ్డుతగిలినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, డివిజన్ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారస్తుల సమస్యను మరోసారి విన్న మంత్రి ఎర్రబెల్లి రోడ్డుపై తనను ఆపడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే ఆఫీసుకు వచ్చి చెప్పాలని సూచించారు. ఇదే క్రమంలో వ్యాపారస్తులు ఎంతకీ కాంప్రమైస్ కాకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుతొలగించి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావుకు దారిచ్చారు.