రైతులకు కేంద్రం రుణాలు..

అన్నదాతలకు కేంద్రం తీపికబురు అందించింది. 3 లక్షల రూపాయల వరకు పంట రుణం అందించేందుకు చర్యలు చేపడుతోంది. రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది. తాజా బడ్జెట్ 2020లోని ప్రతిపాదనలను గమనిస్తే.. ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) కింద నగదు సాయం అందిస్తోంది. ఇది మాత్రమే కాకుండా మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు ఫిబ్రవరి 10 […]

Update: 2020-02-15 00:53 GMT

అన్నదాతలకు కేంద్రం తీపికబురు అందించింది. 3 లక్షల రూపాయల వరకు పంట రుణం అందించేందుకు చర్యలు చేపడుతోంది. రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది. తాజా బడ్జెట్ 2020లోని ప్రతిపాదనలను గమనిస్తే.. ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) కింద నగదు సాయం అందిస్తోంది. ఇది మాత్రమే కాకుండా మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు ఫిబ్రవరి 10 నుంచి రెండు వారాలపాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నారు. తద్వారా రుణాలు కూడా అందించనున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులను పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందుతున్న వారందరికీ అందించాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే 15 రోజుల్లోగా అర్హులందరూ బ్యాంకులకు వెళ్లి ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు పొందొచ్చు.

రుణాల వివరాలు..

కిసాన్ క్రెడిట్ కార్డు కింద రూ.3 లక్షల వరకు రుణం బ్యాంకులు అందిస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన అందరూ రుణాలు తీసుకోవచ్చు. ఈ రుణాలపై 7 శాతం వడ్డీ ఉండగా, కేంద్ర ప్రభుత్వం 3 శాతం సబ్సిడీ అందిస్తుంది. అంటే రైతులకు రుణాలు 4 శాతానికే లభిస్తాయి.

ఇప్పటికే ఆదేశాలు..

మోడీ సర్కారు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లకు, నాబార్డు ఛైర్మన్‌కు కూడా ఆదేశాలు వెళ్లాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందుతూ, కిసాన్ క్రెడిట్ కార్డులు (కేసీసీ) లేని రైతుల జాబితాను తయారు చేయాలని రాష్ట్రాలను, బ్యాంకులను కేంద్రం ఆదేశించింది.

అవగాహన కల్పించాలి..

కేంద్రం ఫిబ్రవరి 10 నుంచి 2 వారాల పాటు రుణాలపై రైతులకు ప్రత్యేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలనీ, అందరికీ సమాచారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను, బ్యాంకులను కోరింది. సంబంధిత శాఖలు, పంచాయతీ సెక్రెటరీల ద్వారా అన్నదాతలకు విషయాన్ని తెలపాలని సూచించింది. బ్యాంక్ సఖీ కార్యక్రమాన్ని కూడా దీనికి ఉపయోగించుకోవాలని తెలిపింది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, రుణాలు మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ సేవలు కూడా అందించాలని కేంద్రం తెలిపింది. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి పథకాల్లో రైతులను చేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది.

Tags:    

Similar News