కవిమాట: ఎవరు గొప్ప?

poet word

Update: 2023-03-05 18:30 GMT

నిరు పేదల ఆకలి మంటలు చల్లార్చువాడు

అంధులకు చేయూత నిచ్చువాడు

ఇంటికో ఇంకుడు గుంత తవ్వి

ఇంటి ముందు చెట్లతో

ఆక్సీజన్ సుగంధాలు వెదజల్లు వాడు

ప్లాస్టిక్ వాడని వాడు

పరిసరాలను పరిశుభ్రముగా ఉంచువాడు

నోబెల్ ప్రైజ్ విన్నర్ కన్నా, దేవుని గుడిలో

పూజలు చేయించుకునే దేవుడి కన్నా

ఎంతో ఎంతో మిన్నా

మత్తులో డ్రైవింగ్ చేయువాడు

కనబడని కరడు గట్టిన నేరస్థుడు

సమాజానికి పట్టిన చెదలు వాడు

జీవిత ఖైదీకి అన్ని అర్హతలు ఉన్నవాడు

కాలం చెల్లిన వాహనాలకు

ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవాడు

కోవిడ్ వ్యాధి కన్న డేంజర్ మనిషి వాడు

నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చి

భవన నిర్మాణాలు చేపట్టువాడు

వందలాది వలస కార్మికులను చంపేవాడు

హైడ్రోజన్ బాంబే వాడు

కులానికో భవనం కట్టించే వాడు

మతములో చిచ్చు పెట్టేవాడు

అప్పులు చేసి దేవాలయాలకు

కోట్లు కుమ్మరించే వాడు

ఉచిత పథకాలు పెట్టీ

ఆర్థిక సంక్షోభం సృష్టించేవాడు

మాయల మరాఠీ వేషాలు వేసేవాడు

గొర్రెల మందలను మింగే తోడేలు వాడు

దేశానికి పట్టిన భయంకరమైన క్యాన్సర్ వాడు

పంచ భూతాలను కాలుష్యం చేయని వాడు

మూఢ నమ్మకాలను కూకటి వేళ్లతో ఊడబెరుకువాడు

సమాజంలో కుళ్ళును ఉతికి ఆరేసే వాడు

శాస్త్రీయ దృక్పథంతో చైతన్యం తెచ్చువాడు

సామాజిక సేవ చేయువాడు.

తూకం రాళ్లు వేసి వెలకట్టలేని బిరుదులున్న

మానవత్వం పరిమళించే గొప్పోడు వాడు

పూసాల సత్యనారాయణ

90007 92400

Tags:    

Similar News

ఊరు

కష్టం

నిలబడతాం!