అబ్బురం అమోఘం ఆశ్చర్యచకితం
ప్రకృతి రహస్యం అంచెలంచెల మోక్షం
ఆవిష్కృతం! మేధోనేత్రం యుక్తిమంత్రం!
సత్యం శివం సుందరం!
రసాయనం భౌతికం లక్షణం
మూలకం మిశ్రమం సమ్మేళనం
అణువు పరమాణువు భార కేంద్రకం
ఆవరించిన సుందర కేళి ఆనంద హేళి
చలిమంటలా, ఆటల మైదానంలా
గొబ్బిళ్ళలా, బతుకమ్మలా, బొమ్మల కొలువులా
ఆవర్తన పట్టిక మనోనేత్రం దర్శనం
ఉపపరమాణువుల ఉనికి
తల్లికి ముందే పిల్లలా!
నరుడా నీ మేధకు కాదేదీ అసాధ్యం!
కరచాలనం అభివాదం
అభినందనం పాదాభివందనం
నూరు మూలకాలు కోట్లల్లో సమ్మేళనాలు!
అనంతానంత విశ్వం.. గ్రహాంతర ప్రయాణం స్థావరం
ఖగోళయుగం కలిసి ఉంటె కలదు సుఖం!
పాచిపట్టిన, కుళ్లిపోయిన రాతియుగం
అడ్డుగోడలు కృత్రిమం
భావనలు భావాలు విసర్జనం అతి ప్రధానం
పరిశీలనం ప్రయోగం ఫలితం విశ్లేషణం
సిద్ధాంతం అవతరణం
మానవ పురోగమనం ఖాయం!
ప్రొఫెసర్. సీతారామ రాజు సనపల
72595 20872