కటిక చీకటి కాంతులలో
మినుగురునై మెరవనా
మది తాకిన నిశ్శబ్ద గీతికతో
మౌనాలాపన చేయనా
మమతలు దూరమైన మనసున
ముచ్చటైన గువ్వనై ఎగరనా
గుండె గూటిలో గుడి కట్టి
గగనాన్ని చుట్టి రానా
నాలుగు దిక్కులు వినబడేలా
అక్షర డోలికలు మోగించనా
కంటికి కనబడని బాధతో
క్షణక్షణం యుద్ధం చేయనా
కన్నీరై కరిగిపోయే కష్టాలకు
కార్పెట్ పరచి బాయ్ చెప్పనా
ఆశలా విచ్చుకునే కొత్త ఆశయాలకు
జతకట్టి ధైర్యం అవ్వనా
జ్వలించే ఆలాపన సెగలలో
కరిగిపోయే చినుకునై కురవనా...!!!
పోలగాని భాను తేజశ్రీ
98665 97260