డబ్బు

Poem

Update: 2024-07-14 18:45 GMT
డబ్బు
  • whatsapp icon

కొత్తగా పరిచయం అవసరం లేదు.

దీనికోసం చేయని పని అంటూ ఉండదు.

దీనికోసం చెప్పనీ అబద్ధాలు ఉండవు.

మనిషి చేతుల్లో పుట్టి, మనిషినే

మట్టిలో కరిపించే...ఒకే ఒక ఆయుధం.

ఎక్కువగా ఉన్నా నిద్ర ఉండదు..

తక్కువగా ఉన్నా తిండి సరిగా ఉండదు..

కావలసినంత ఉంటే

మనుషులు సరిగా ఉండరు...

ప్రపంచంలో ఎన్ని భాషలున్న

నోరు లేకున్న పలికిస్తుంది...

ప్రపంచంలో ఎన్ని మతాలున్నా

కళ్ళు లేకుండా నడిపిస్తుంది...

ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నా

కళ్ళు లేకున్నా చూపిస్తుంది.

మనషిలో మృగాన్ని,

కుళ్ళు ,కుతంత్రం ,స్వార్థం, ఈర్ష..

ఇవన్నీ చూపించే ఆయుధం ఒకటే..

మనిషిలో ఉండే గర్వాన్ని అణచివేస్తుంది.

మనిషిని మనిషిలా చూపించడం

మాత్రం మర్చిపోతుంది..

మనిషి పుట్టుకకు చావుకు, మంచి చెడుకి,

ప్రతి అవసరం డబ్బుతో మాత్రమే

తీరేలా చేస్తుంది కొన్నిసార్లు.

- రాగిపని బ్రహ్మచారీ

95424 64082

Tags:    

Similar News

స్మృతులు