ప్రభుత్వం మారినప్పుడల్లా
జెండాలు మారుతున్నాయి
గుర్తులు మారుతున్నాయి
ముద్రలు, రంగులు
భవంతులు, విగ్రహాలు
పాటలు, ఆటలు
విధులు, విధానాలు
అన్నీ మారుతున్నాయి
ఏవేవో, ఎన్నెన్నో
ఎందుకో, ఏమో
అవసరం లేకున్నా
మారుతున్నాయంతే
అనుకూలత కోసమో
పగ-ప్రతీకారాల కోసమో
విద్వేషమో, వికృతత్వమో
పిచ్చితనమో, ఇంకేమో
ఆకస్మికంగా
అన్నీ మారుతుంటాయి
అసలు మారాల్సిన
ప్రజల జీవితాలు తప్ప!!
౼ కార్తీక రాజు
89773 36447