రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం అనుమతినివ్వకపోయినప్పటికీ కోట్లలో మద్యం విక్రయాలు జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా వైన్‌షాప్‌లలో ఉండే రద్ధీని దృష్టిలో ఉంచుకుని మద్యం ప్రియులు నాలుగు రోజుల ముందుగానే మందు కొని పెట్టుకోవడం మొదలు పెట్టారు. దీంతో గత నెల 28వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.760 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. కాగా […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం అనుమతినివ్వకపోయినప్పటికీ కోట్లలో మద్యం విక్రయాలు జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా వైన్‌షాప్‌లలో ఉండే రద్ధీని దృష్టిలో ఉంచుకుని మద్యం ప్రియులు నాలుగు రోజుల ముందుగానే మందు కొని పెట్టుకోవడం మొదలు పెట్టారు. దీంతో గత నెల 28వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.760 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. కాగా డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.200 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. నాలుగురోజుల పాటు జరిగిన మద్యం విక్రయాల గణాంకాలు పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాలలోనే సుమారుగా రూ.300 కోట్ల విక్రయాలు జరగడం గమనార్హం. చలికాలమైనప్పటికీ సుమారు 6.5 కోట్ల బీరు కేసులు అమ్ముడు పోయాయి. కరోనా భయం వెన్నాడుతున్నా గతేడాదితో పోలిస్తే ఈఏడాది ప్రభుత్వానికి రూ.200 కోట్ల అధిక ఆదాయం సమకూరింది.