ఉమెన్స్ డే స్పెషల్ : సమానత్వం కోసం ఫైట్ చేసిన మహిళలు వీరే

ఆకాశంలో సగం మహిళలు అంటారు. మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళలపై వివక్ష అనేది మునుపటితో పొలిస్తే కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళలు

Update: 2024-03-06 11:19 GMT

దిశ, ఫీచర్స్ : ఆకాశంలో సగం మహిళలు అంటారు. మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళలపై వివక్ష అనేది మునుపటితో పొలిస్తే కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళలు అణచివేతకు గురి అవుతున్నారు. వీరి కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లైంగిక వేధింపులు, అత్యాచారాలు అనేవి తగ్గడం లేదు.

ఇక మహిళలకు అన్నింట్లో సమానత్వం ఉండాలని అంటారు. మహిళలు కూడా ఇప్పటికీ మేము దేనిలో తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా నాయకత్వంలో కూడా పురుషులకు స్త్రీలు పోటినిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలందరూ మార్చి 8న జరుపుకుంటారు.ఈ నేపథ్యంలో మనం స్త్రీ సమానత్వం కోసం పోరాడిన మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.





సావిత్రీబాయి ఫూలే : మహిళలందరూ గొప్పగా చెప్పుకునే మహిళా ధీరురాలు సావిత్రిబాయి పూలే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈమె దేశంలోనే అన్ని కులాల బాలికలకు విద్యనందించేందుకు 17 పాఠశాలలను స్థాపించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. స్త్రీ పురుషుల కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి ఫూలే.

డా. వినా మంజుందార్ : మహిళా సంక్షేమం, సమానత్వం కోసం పోరాడిన మొదటి మహిళ. భారతదేశం అంతటా పితృస్వామ్య వ్యవస్థలలో స్త్రీల విభిన్న అనుభవాలను అర్థం చేసుకోవడానికి ఆమె ఎక్కువ సమయం గడిపింది. ఆమె పరిశోధన ద్వారా అనేక విషయాలను తెలుసుకున్నారు. ఇది 1980లో సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్ స్థాపనకు దారితీసింది.

ఫాతిమా షేక్.. సమాజం కోసం ఎంతో సేవ చేసి గుర్తింపు రానటువంటి మహిళ ఫాతిమా షేక్. ఈమెను మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలిగా చెబుతారు. కానీ అణగారిన వర్గాల మహిళల అభ్యున్నతికి పాటుపడిన వారిలో ఫాతిమా ఒకరు. ఫూలే, ఫాతిమా బాధ్యతలను పంచుకోవడమే కాకుండా ఇద్దరూ మహిళల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారు.సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా షేక్ ఇంట్లో ఒక పాఠశాలను స్థాపించి, అట్టడుగు వర్గాల మహిళలకు బోధించడం ప్రారంభించారు. దీంతో ఫాతిమా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముస్లిం మహిళగా ఫాతిమా షేక్ పడిన నష్టాలను తక్కువ అంచనా వేయలేం.

తారాభాయ్ షిండే : పితృస్వామ్యానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన స్త్రీవాద ఉద్యమకారిణి. హిందూ గ్రంధాలలో కనిపించే స్వాభావిక పితృస్వామ్యాన్ని ధిక్కరించారు. ఆమె అభిప్రాయాలు నేటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. మరాఠీ లో ప్రచురించబడిన ఆమె మొదటి రచన 'స్త్రీ పురుష్ ధులానా'. దీనిలో ఆమె స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలను అన్వేషించారు


Similar News