గొరిల్లాలు ఎందుకు గుండెలు బాదుకుంటాయి? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు

సాధారణంగా గొరిల్లాలు తమ చేతులతో ఛాతీ మీద లయబద్ధంగా కొట్టుకుంటాయి. చాలా సేపు ఇదే పద్ధతిని కొనసాగిస్తాయి. ముఖ్యంగా సిల్వర్ బ్యాక్స్ గా పిలువబడే మగ గొరిల్లాలు ఇలా చేస్తుంటాయి. కాగా

Update: 2024-08-06 07:26 GMT
గొరిల్లాలు ఎందుకు గుండెలు బాదుకుంటాయి? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: సాధారణంగా గొరిల్లాలు తమ చేతులతో ఛాతీ మీద లయబద్ధంగా కొట్టుకుంటాయి. చాలా సేపు ఇదే పద్ధతిని కొనసాగిస్తాయి. ముఖ్యంగా సిల్వర్ బ్యాక్స్ గా పిలువబడే మగ గొరిల్లాలు ఇలా చేస్తుంటాయి. కాగా ఈ ప్రవర్తనపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు.. దేని వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది గొరిల్లా సామాజిక జీవితంలో కమ్యూనికేషన్, సంభోగం, రక్షణతో సహా అనేక కీలకమైన విధులకు సంకేతంగా ఉందని తెలిపారు.

  • ఛాతీ కొట్టుకోవడం నాన్ వోకల్ కమ్యూనికేషన్ అని.. చాలా దూరం ప్రయాణించగల శక్తివంతమైన ధ్వని సృష్టించడం ద్వారా, గొరిల్లాలు ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రదర్శనను ఉపయోగిస్తాయి. ఎంత దూరం ఆ శబ్దం ప్రయాణిస్తుందో.. ఆ పరిధిలోకి మరో సమూహానికి చెందిన గొరిల్లాలు ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు.
  • గుండెలు బాదుకోవడం ద్వారా గొరిల్లాలు తమ బలాన్ని, ఉనికిని సూచిస్తాయి. తమ అధికారం గురించి నొక్కి చెప్తూ.. ప్రత్యర్థులను నిరోధించే సిగ్నల్ ఇస్తాయి.
  • ఇక ఫిట్ నెస్ కు ప్రతిరూపంగా కూడా వర్ణించే ఈ ప్రదర్శన ఆడ గొరిల్లాను ఆకర్షించేందుకు ఉపయోగిస్తాయి. ఈ సంకేతంలోనే సంభోగానికి అనుకూలతను అంచనా వేసే ఆడ జంతువులు నచ్చితే కమ్యూనికేట్ అవుతాయి.
  • తమ ఆధీనంలో ఉన్న చిన్న గొరిల్లాలకు సామాజిక నైపుణ్యాలను అందించేందుకు ఈ పద్ధతిని వినియోగిస్తాయి. బాల్యం నుంచే తమ ఆటలో ఇలా నేర్పించడం ద్వారా పెద్దయ్యాక శారీరక సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. మొత్తానికి గొరిల్లా సొసైటీ డైనమిక్స్ లో గుండెలు బాదుకోవడం మల్టీ పర్పస్ గా యూజ్ చేయబడుతుంది.
Tags:    

Similar News