భరించలేని బాధ కలిగినప్పుడు గదిలో కూర్చొని ఏడ్చేయండి.. ఇలా చేస్తే ఆ సమస్యలు తగ్గుతాయ్..!
సాధారణంగా మనిషికి భరించలేని నొప్పి, బాధ కలిగినప్పుడు ఏడుస్తుంటారు
దిశ, ఫీచర్స్: సాధారణంగా మనిషికి భరించలేని నొప్పి, బాధ కలిగినప్పుడు ఏడుస్తుంటారు. కానీ, ఇవి వాటంతటిగా అవే రావు.. మానసికంగా వేదన కలిగినప్పుడు ఎవరూ కంట్రోల్ చేసుకోలేరు. సంతోషం ఎక్కువైనా.. కన్నీళ్లు ఆనంద బాష్పాల రూపంలో వస్తాయి. అయితే ఏడవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిపుణులు ఏడుపు మానవ భావోద్వేగాలలో ఒకటని చెబుతున్నారు. శారీరక, మానసిక బాధ కన్నీళ్ల ద్వారా వ్యక్తమవుతుంది. చాలా మంది నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని కాసేపు వదిలేస్తే నార్మల్ అవుతారని వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా చేయడం వల్ల ఆ మనిషి బాధ పోతుంది.
ఎందుకంటే.. ఏడ్చినప్పుడు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయి ఎండార్ఫన్ ను విడుదల చేస్తుందని చెబుతున్నారు. ఇది, బాధను తగ్గిస్తుంది. అందుకే, మనుషులు తీవ్ర బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా ఆటోమేటిక్‌గా ఏడుస్తుంటారు. కన్నీళ్లు ఓదార్పునిచ్చే మౌన భాష అని.. దీని వల్ల సామాజిక బంధాలను పటిష్టం చేస్తాయని అంటున్నారు. ఏడవడం వల్ల బాధ మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
శారీరక, మానసిక బాధల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ మారడానికి కూడా సహాయపడుతుంది. నిద్ర లేమి సమస్యలు కూడా తగ్గుతాయి. దీంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు వివరించారు. ఏడవడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుందని చెప్పారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.