WhatsApp New Privacy Features.. ఆన్‌లైన్‌లో ఎవరికి కనబడాలో డిసైడ్ చేసుకోవచ్చు!

WhatsApp to Roll Out New Privacy features| ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. యూజర్ల సౌకర్యార్థం సరికొత్త సేఫ్టీ ఫీచర్స్‌ ప్రకటించింది. అనవసరమైన గ్రూప్స్ నుంచి సైలెంట్‌గా సైడ్ అయిపోయే అవకాశాన్ని కల్పించడం సహా వాట్సాప్‌ను ప్రైవేట్‌గా చూసుకునే వెసులుబాటు కల్పించనుంది

Update: 2022-08-10 07:26 GMT

దిశ, ఫీచర్స్ : WhatsApp to Roll Out New Privacy features| ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. యూజర్ల సౌకర్యార్థం సరికొత్త సేఫ్టీ ఫీచర్స్‌ ప్రకటించింది. అనవసరమైన గ్రూప్స్ నుంచి సైలెంట్‌గా సైడ్ అయిపోయే అవకాశాన్ని కల్పించడం సహా వాట్సాప్‌ను ప్రైవేట్‌గా చూసుకునే వెసులుబాటు కల్పించనుంది. అంటే ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరికి కనబడాలి? ఎవరికి కనబడకూడదో ముందే నిర్ణయించుకోవచ్చు. ఈ రెండింటితో పాటు మరో ఫీచర్‌ను కూడా ఈ నెలలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మాతృ సంస్థ మెటా వెల్లడించింది.

లీవ్ గ్రూప్స్ సైలెంట్లీ :

ఈ సరికొత్త ఫీచర్ సాయంతో ఏ సభ్యుడైనా గ్రూప్ నుంచి ఎవరికి తెలియకుండా నిష్క్రమించవచ్చు. ఈ విషయం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే తెలుస్తుంది.

ఆన్‌లైన్'లో ఉన్నప్పుడు ఎవరికి కనబడాలి?

యూజర్లు చాలామంది తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను ప్రైవేట్‌గా ఉంచుకోవాలని అనుకుంటారు. ఉదాహరణకు ఆన్‌లైన్‌లో ఎవరో ఒకరితో ఏదో టాపిక్ డిస్కస్ చేస్తున్నపుడే మరికొందరు మెసేజ్ చేస్తుంటారు. ఈ సమయంలో మిగతావారికి సరిగ్గా రెస్పాండ్ కావచ్చు, కాకపోవచ్చు. దీనివల్ల సదరు వ్యక్తి అపార్థం చేసుకునే అవాకాశం లేకపోలేదు. ఇలాంటి ఇబ్బందులను దూరంచేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరికి అందుబాటులో ఉండాలో ఎంపిక చేసుకోవచ్చు.

వ్యూ వన్స్ మెసేజెస్..

ఏదైనా ఫొటో, వీడియోను ఒకేసారి చూసేవిధంగా వాట్సాప్‌లో ఓ ఆప్షన్ ఉంది. నిజానికి చాలా మంది వీటిని స్క్రీన్‌షాట్స్‌ తీసుకుంటారు. ఈ విధానాన్ని 'వ్యూ వన్స్ మెసేజెస్' ఫీచర్ నిరోధిస్తుంది.

వాట్సాప్ ప్రైవసీ అధ్యయనం ద్వారా ఈ కొత్త ఫీచర్స్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. దీని ప్రకారం 72% మంది నిజాయితీగా, ఫిల్టర్ చేయని విధంగా మాట్లాడటాన్ని విలువైనదిగా గుర్తిస్తే.. 51% మంది తాము ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో ఎంచుకునేందుకు ఆన్‌లైన్‌లో హైడింగ్ ఆప్షన్‌ను ఇష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కొత్త ఫీచర్ల గురించి ఇండియా, యూకేలోని తమ యూజర్లకు అవగాహన కల్పించేందుకు వాట్సాప్ కొత్తగా ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తుంది.

గులాబి రంగు చెరువులో గుండెను తాకే ఆమె మ్యూజిక్ (వీడియో) 

Tags:    

Similar News