పిల్లలు మొబైల్‌ను అదేపనిగా చూడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే..?

ఈ రోజుల్లో చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళ కంటే ఎక్కువగా ఫోన్ ని వాడుతున్నారు.

Update: 2024-06-18 11:49 GMT

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళ కంటే ఎక్కువగా ఫోన్ ని వాడుతున్నారు. కొంతమంది తల్లి దండ్రులు, పిల్లలు ఏడవగానే చేతిలో టాబ్లెట్, సెల్ ఫోన్ పెట్టేస్తున్నారు. అయితే, పేరెంట్స్ తమ పిల్లలను బిజీగా ఉంచుతూ వారిని తీవ్ర అనారోగ్యానికి ఎలా గురి చేస్తున్నారో తెలుసా? ఫోన్ తీసుకున్న తర్వాత పిల్లలు ప్రశాంతంగా ఉంటారు, కానీ అదే పనిగా.. గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోవడం అలవాటు చేసుకుంటాడు. స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం పిల్లల మెదడుపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సెల్ ఫోన్లు, గాడ్జెట్‌లు, టీవీలకు అలవాటు పడి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోందని ఓ నివేదిక చెబుతోంది. దీని వలన "వర్చువల్ ఆటిజం" సమస్య వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు మొబైల్ ఫోన్‌లకు బానిసలైనప్పుడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

వర్చువల్ ఆటిజం 4 నుండి 5 సంవత్సరాల పిల్లలలో సంభవిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు అతిగా ఉపయోగించడం పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరం. 1 నుండి 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు వర్చువల్ ఆటిజం యొక్క అధిక ప్రమాదంలో ఉన్నారు. అయితే ఇది పిల్లలకు చాలా హానికరం అంటున్నారు నిపుణులు అంటున్నారు.

పిల్లలు ఫోన్‌లు నుంచి బయట పడాలంటే తల్లిదండ్రులే ముందుగా ఫోన్‌లు, టెలివిజన్‌లు, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లకు దూరం పెట్టాలని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులు నుంచే ఈ మార్పు మొదలవ్వాలి. పిల్లలతో పాటు మీరు కూడా మీ నిద్ర అలవాట్లను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.


Similar News