సెక్స్ లైఫ్‌కు, పొగతాగడానికి ఉన్న సంబంధం ఏంటి..?
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది కాన్సర్‌కు కారణమవుతుంది.. చివరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని డాక్టర్లు ఎంత చెప్పినా.. సినిమాల్లో, టీవీల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. స్మోకింగ్ చేయడం మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.
దిశ, ఫీచర్స్: పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది కాన్సర్‌కు కారణమవుతుంది.. చివరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని డాక్టర్లు ఎంత చెప్పినా.. సినిమాల్లో, టీవీల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. స్మోకింగ్ చేయడం మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది దీని కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. టెన్షన్ పేరుతో స్టార్ట్ అయ్యే ఈ అలవాటు క్రమంగా పొగకు బానిసను చేస్తుంది. సిగరెట్ తాగేవారికే కాకుండా పక్కన ఉన్న వారిని కూడా ప్రమాదంలో పడేస్తుంది. ఈ అలవాటు కారణంగా పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, వివిధ క్యాన్సర్లతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 13.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
పొగాకు తాగడం మానేయాలని డబ్ల్యూహెచ్‌ఓ(WHO)100 కు పైగా కారణాలను చూపుతూ సంవత్సరం పొడవునా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం ప్రారంభిస్తూనే ఉంది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం కోవిడ్- 19 ప్రభావం వల్ల లక్షల మంది సిగరెట్ తాగడం పూర్తిగా వదిలేయాలని తెలిపింది. పొగాకు వాడకాన్ని వదులుకోవడానికి ప్రయత్నిస్తున్న 10 కోట్ల మందికి మద్దతు ఇవ్వడమే ఈ ప్రచార లక్ష్యమని వెల్లడించింది. అయితే ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్‌కు కారకం అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ పొగ తాగడం పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుందని, వీరి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ తాగడానికి - లైంగిక ఆరోగ్యానికి మధ్య అనుసంధానం ఉందని.. ఇది మీ లిబిడో, లైంగిక పనితీరు, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందని నిపుణులు వెల్లడించారు. కాగా ధూమపానానికి.. సెక్స్ లైఫ్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* వీర్యంలో మార్పులు రావడం:
ధూమపానమే కాకుండా.. మద్యం, కాఫీ, డ్రగ్స్ వంటి ఇతర పదార్థాలు దుర్వాసనతో కూడినవి. ఇవి మీ వీర్యం, యోని ద్రవాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాగా వీర్యం తో పాటు శారీరక స్రావాలను ప్రభావితం చేసే పొగాకులో ఉండే అనేక డేంజరస్ రసాయనాలు దీనికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
* అంగస్తంభన ఇబ్బందులు:
ఎన్నో అధ్యయనాలు ధూమపానాన్ని అంగస్తంభనతో ముడిపెట్టాయి. పొగాకులోని వ్యసనపరుడైన నికోటిన్, పురుషాంగానికి బ్లడ్ సరఫరా చేసే నాళాలతో పాటు బాడీ అంతటా రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుందట. దీని కారణంగా అంగస్తంభన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
*స్పెర్మ్ కౌంట్ తగ్గడం:
ధూమపానం స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. తండ్రులు కావాలని కోరుకునే పురుషులకు ధూమపానం స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. తద్వారా సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఎన్విరాన్‌మెంటల్ ఎపిడెమియాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పొగ తాగడం వల్ల వీర్యం పరిమాణం తగ్గడం, సారవంతమైన మగవారిలో టోటల్ స్పెర్మ్ కౌంట్, ముఖ్యంగా ఎక్కువగా సిగరెట్ తాగే వారిలో స్పెర్మ్ చలనశీలత తగ్గిస్తుందని వెల్లడైంది.
* స్ట్రీలలో అండం నాణ్యత క్షీణించడం:
సిగరెట్ తాగడం వల్ల కేవలం పురుషులకు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటారు. జర్నల్ ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ధూమపానం అండాశయ నిల్వల క్షీణతను వేగవంతం చేస్తుంది. ఇది అండం సంఖ్య తగ్గడానికి, అండం నాణ్యత క్షీణించడానికి దారితీస్తుందని తేలింది. అలాగే సిగరేట్ తాగే మహిళలు 50 ఏళ్లలోపు మెనోపాజ్‌ను ఎదుర్కొనే చాన్స్ ఉంటుంది. అకాల రుతువిరతి సంతానోత్పత్తిని ప్రభావితం చేయడంతో పాటు అనేక ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది. పునరుత్పత్తి ఆరోగ్యం కోసం పొగ తాగడం మానేయడం మేలు అంటున్నారు నిపుణులు.