పావురాలను ఇంట్లో పెంచుకుంటే ధనలాభం.. ప్రేమ వివాహం జరుగుతాయా..?
చాలా మంది జంతు, పక్షిప్రేమికులు జంతువులను, పక్షులకు పెంచుకుంటూ ఉంటారు.
దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది జంతు, పక్షిప్రేమికులు జంతువులను, పక్షులకు పెంచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని జంతువులను, పక్షులకు పెంచుకోవడం వలన మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. అలాగే సంపద, అదృష్టం, గౌరవం, ఆరోగ్యం, దురదృష్టం వంటివి కూడా ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం జంతువులు, పక్షులకు సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు చర్చలోకి వస్తూనే ఉంటాయి. పక్షులను బంధించడం, అవి ఇంట్లో గూడు పెట్టుకోవడం గురించి చర్చస్తూ ఉంటారు. అందులో ఒక పక్షే పావురం. పావురాన్ని శాంతికపోతం అంటారు. అలాగే లక్ష్మీ దేవి దూతగా కూడా భావిస్తారు. పావురం ఇంట్లోకి వచ్చివెళితే అది అదృష్టంగా భావిస్తారు.
అది ఇంట్లో బాల్కనిలోకి వచ్చినపుడు దానికి ధాన్యం వేస్తే మంచిదంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని, జీవితంలో అంతా శుభం కలుగుతుంది నమ్ముతారు. అలాగే ప్రేమ వివాహం జరగాలనుకునేవారు పావురాలకు ఆహారం పెడితే ప్రేమవివాహం జరుగుందని నమ్ముతారు. కానీ అదే పావురం ఇంట్లో ఎక్కడయినా గూడు కట్టడం ప్రారంభిస్తే అది అశుభం అని అంటారు పెద్దలు. అలాగే ఆరోగ్య సమస్యలను తెస్తుందట. పావురం ఇంట్లో గూడు కట్టడం వలన, పావురాన్ని పెంచుతూ దాన్ని బంధించడం వలన ఆ ఇంటికి పేదరికం సంభవిస్తుందని నమ్ముతారు. అందుకే పావురం ఇంట్లో ఎక్కడయినా గూడు కడితే వెంటనే దాన్ని తీసివేయాలంటారు.
Also Read...